శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - తొంభయ్యి ఒకటవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 91)
శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము తొంభయ్యి ఒకటవ సర్గ ఆ రాత్రికి భరద్వాజుడు భరతునికి అతని పరివారమునకు సేనలకు భోజన సదుపాయములను చెయ్యాలని అనుకున్నాడు. దానికి భరతుడు ఇలా అన్నాడు. “ఓ మహర్షీ! మీరు వసిష్ఠుల వారికి, నాకూ అర్ఘ్యము పాద్యము ఫలములు ఇచ్చి సత్కరించారు కదా! అది చాలు నాకు." అని అన్నాడు. "భరతా! నీవు ఏదీ కోరవు అని నాకు తెలుసు. కాని కాదనకుండా నా ఆతిధ్యము స్వీకరించు. నీవు నీ పరివారమును, సైన్యమును ఎందుకు దూరంగా ఉంచావు. మా ఆశ్రమమునకు తీసుకొని రావలసినది." అని అన్నాడు భరద్వాజుడు. దానికి భరతుడు ఇలా అన్నాడు. “ఓ మహర్షీ! తమ ఆశ్రమ ప్రశాంతతకు భంగము కలిగించడం ఇష్టం లేక, తమరి మీద ఉన్న భయ భక్తులతో నేను నాపరివారమును సైన్యమును దూరంగా ఉంచి వచ్చాను. అదీ కాకుండా రాజులు తమ మందీ మార్బలములను, మునులకు దూరంగా ఉంచాలని రాజధర్మము కదా! నా వెంట చతురంగ బలములు వస్తూ ఉన్నాయి. అవి ఇక్కడకు వస్తే ఇక్కడి వృక్ష సంపద, జలసంపద కలుషితము అవుతాయి. అందుకని తీసుకొని రాలేదు.” అని అన్నాడు భరతుడు. దానికి భరద్వాజుడు నవ్వి “మాకు ఏమీ అసౌకర్యము లేదు. నీ సేనలను ఇక్కడకు రమ్మని చెప్పు" అని ఆదేశించాడు. ఆ ప్రకారము భరతుని సేనలు...