శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - ఎనుబది ఒకటవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 81)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
ఎనుబది ఒకటవ సర్గ
దశరథుడు చనిపోయి 13 రోజులు గడిచిపోయాయి. కర్మకాండలు అన్నీ పూర్తి అయ్యాయి. శోకదినములు గడిచిపోయాయి. 14వ రోజున రాచరిక లాంఛనాలు ప్రారంభం అయ్యాయి. తెల్లవారు జామునే వందిమాగథులు భరతుని స్తోత్రం చేస్తున్నారు. దుందుభులు మ్రోగిస్తున్నారు. మంగళవాద్యములు మోగుతున్నాయి. వేశ్యలు నృత్యం చేస్తున్నారు. అంతా కాబోయే మహారాజు భరతుని మేలుకొలుపు తున్నారు. కాని ఈ రాజలాంఛనాలు అన్నీ భరతునికి చికాకు పుట్టించాయి. అతనికి ఇంకా దుఃఖము ఎక్కువ అయింది."ఆపండి. నేను రాజును కాను." అని గట్టిగా అరిచాడు. అన్నీ ఆగిపోయాయి. భరతుడు శత్రుఘ్నుని చూచి ఇలా అన్నాడు.
"శత్రుఘ్నా! చూచావా. కైక వలన ఎంతటి అనర్ధము వాటిల్లిందో. మహారాజు రాజ్యభారము నా మీద మోపి తాను హాయిగా స్వర్గసుఖములు అనుభవిస్తున్నాడు. ఈ కష్టములు అన్నీ నాకు వదిలి రాముడు హాయిగా వనవిహారము చేస్తున్నాడు. నేను ఒంటరిగా మిగిలిపోయాను.' అని రోదిస్తున్నాడు.
ఇది ఇలా ఉంటే వసిష్ఠుడు రాజసభను ఏర్పాటు చేసాడు. అయోధ్యలో ఉన్న అన్ని కులముల వారినీ, అమాత్యులనూ, పురప్రముఖులను, గణాధ్యక్షులను, సభకు ఆహ్వానించాడు. వారందరూ సభలో తమ తమ ఆసనములమీద కూర్చున్నారు. తరువాత వసిష్ఠుడు భరతుని, శత్రుఘ్నుని, యుధాజిత్తును, సుమంత్రుని తీసుకొని రమ్మని భృత్యులను పంపించాడు. భరతుడు, శత్రుఘ్ను సమేతంగా వచ్చిసభలో కూర్చున్నాడు. భరతుడు రాగానే అందరూ లేచి ఆయనకు అభివాదములు తెలియ జేసారు.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఎనుబది ఒకటవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment