శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - అరువది ఆరవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 66)
శ్రీమద్రామాయణము అరణ్య కాండము అరువది ఆరవ సర్గ లక్షణుని మాటలు రాముని మీద పనిచేయలేదు. ప్రస్తుతానికి లోకాలను క్షోభింపజేసే కార్యక్రమము విరమించాడు కానీ, సీతను గురించి శోకించడం మానలేదు. రాముని మానసిక స్థితి పూర్తిగా దిగజారి పోయింది. మానసికంగా శక్తిని, బలాన్ని కోల్పోయాడు. రాముని స్థితిని గమనించిన లక్ష్మణుడు రామునికి ధైర్యం చెప్పడం మొదలెట్టాడు. “రామా! మన తండ్రి దశరథుడు అనేక సంవత్సరాలు పుత్ర సంతతి లేక. యజ్ఞములు, యాగములు చేసి మనలను పొందాడు. నీ వియోగమును తట్టుకోలేక ఈ లోకాన్నే విడిచిపెట్టాడు మన తండ్రి దశరథుడు. నీవు రాజ్యాని పోగొట్టుకున్నావు. ఇటువంటి కష్టములను ధీరోదాత్తుడవైన నీవే తట్టుకోలేకపోతే సామాన్య ప్రజలు ఎలా తట్టుకోగలరు. యయాతి లాంటి మహారాజుకే కష్టములు తప్పలేదు. ఇంక మనము ఎంత! కష్టములు, సుఖములు, ఒకదాని వెంట ఒకటి రావడం లోక సహజం. వాటిని తట్టుకొని నిలబడడమే మానవుని కర్తవ్యము. మన తండ్రి పురోహితులు వసిష్ఠులవారికి ఒకే రోజు నూర్గురు కుమారులు కలిగారు. వారందరూ విశ్వామిత్రుని కోపాగ్నికి బలి అయి ఒకేరోజు మరణించారు. ఇంతెందుకు, భూదేవి కూడా ప్రతిరోజూ ఈ మానవుల చేతిలో ఎన్నో కష్టములను భరిస్తూ ఉంది. సూర్య చంద్రులు క...