శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - నలుబది ఆరవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 46)
శ్రీమద్రామాయణము
అరణ్య కాండము
నలుబది ఆరవ సర్గ
సీత మాట్లాడిన పరుషమైన వాక్యములకు బాధపడి లక్ష్మణుడు రాముని వెతుకుతూ వెళ్లిన వెంటనే ఈ అవకాశము కొరకు వేచి ఉన్న రావణుడు తను దాగి ఉన్న పొదలమాటు నుండి బయటకు వచ్చాడు. ఆ సమయంలో రావణాసురుడు ఒక సన్యాసి వేషంలో ఉన్నాడు. కాషాయ బట్టలు ధరించాడు. చేతిలో దండము, కమండలము పట్టుకున్నాడు. జటాజూటములు కట్టుకున్నాడు. ఒక గొడుగు పట్టుకున్నాడు. కాళ్లకు పాదుకలు ధరించాడు. కపట సన్యాసి వేషంలో ఉన్న రావణుడు సీత ఉన్న చోటికి వచ్చాడు.రావణుని రాకతో అక్కడి ప్రకృతి కూడా వణికిపోయింది. గాలి ఆడటం మానేసింది. పక్కనే ప్రవహిస్తున్న గోదావరి నది కూడా మెల్లగా శబ్దం చెయ్యకుండా ప్రవహించసాగింది. రావణుడు సీత దగ్గరగా వచ్చాడు. ఆ సమయంలో సీత రామునికి ఏమి ఆపద సంభవించిందో అని బాధపడుతూ దు:ఖిస్తూ కూర్చుని ఉంది. సీతను చూడగానే రావణుడికి మన్మధుని బాధ ఎక్కువ అయింది. సీతను చూచి రావణుడు ఇలా అన్నాడు.
“ఓ తరుణీ! నీవు ఎవరవు? అన్నిశుభలక్షణములు కల నీవు ఎవరు? నీవు ఆ శివుని అర్ధాంగి పార్వతివా? లేక కీర్తికి అధిష్టాన దేవతవా! లేక కాంతి దేవతవా! లేక లక్ష్మివా! దేవ కాంతవా! అప్సరసవా! లేక మన్మధుని మనోహారిణి రతీదేవివా!
ఓ లలనా! నీ వంటి సౌందర్యవతిని నేను ఇంతవరకూ భూమండలములోనే కాదు ముల్లోకములలో చూడలేదు. నీవు ఈ అరణ్యములలో ఉండతగవు. నిన్ను ఆ అరణ్యములో ఈ పర్ణశాలలో చూస్తుంటే నాకు బాధగా ఉంది. ఈ అరణ్యము రాక్షసుల నివాసము. ఎక్కడో రాజభవనములలో, అంతఃపురములలో రాచభోగములు అనుభవించవలసినదానికి ఇక్కడ ఎందుకున్నావు.
నీకు వివాహమైనదా! నీ భర్త ఎవరు? నీవు మానవ కాంతవు మాత్రము కావు! నీవు దేవతాస్త్రీవి అయి ఉండవలెను. రాక్షసులు సంచరించు ఈ అరణ్య ప్రాంతమునకు దేవతలు, గంధర్వులు, కింనరులు కూడారారు. అటువంటిది నీవు ఎందుకు వచ్చావు? ఈ అరణ్యములో ఉన్న పులులు, సిహములు మొదలగు క్రూరమృగములను చూచి నీకు భయం వెయ్యడం లేదా!
మరలా అడుగుతున్నాను. నీవు ఎవరు? నీ భర్త ఎవరు? నీవు ఎక్కడి నుండి వచ్చావు? ఈ రాక్షసరాజ్యంలో ఒంటరిగా ఎందుకు ఉ న్నావు?” అని అడిగాడు రావణుడు.

బ్రాహ్మణుడు, సన్యాసి వేషములో ఉన్న రావణునికి సీత అర్ఘ్యము, పాద్యము ఇచ్చి సత్కరించింది. అతిథి పూజలు చేసింది. తినడానికి పండ్లు కూడా ఇచ్చింది. సీత తనకు అతిధి మర్యాదలు చేస్తుంటే, రావణుడు ఆమెను ఎలా బలవంతంగా తీసుకొని పోవాలా అని ఆలోచిస్తున్నాడు. తన చావు తానే కొనితెచ్చుకుంటున్నాడు.
రావణునికి అతిధి సత్కారములు చేసి, గుమ్మము వద్దకు వచ్చి సీత రాముడు, లక్ష్మణుడు వస్తున్నారా అని చూసింది. కాని రామలక్ష్మణులు ఎంతకూ కనపడలేదు.
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము నలుబది ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment