శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - అరవయ్యవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 60)
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము
అరవయ్యవ సర్గ
రాముడు సీత కోసం పిచ్చిగా పర్ణశాల అంతా తిరుగు తున్నాడు పరిసరాలు వెతికిన చోటనే వెతుకుతున్నాడు. సీత ఎక్కడన్నా దొరక్కపోతుందా అనే కొన ఆశతో వెదుకుతున్నాడు. సీత నిలబడ్డ చోటు, సీత కూర్చున్న చోటు, సీత వాడిన దర్భాసనము, వీటిని చూచి భోరున విలపిస్తున్నాడు.“నాసీతను రాక్షసులు పీక్కుతిని ఉంటారు. లేదా రాక్షసులను చూచి సీత మరణించి ఉంటుంది. లేక సీతను ఎవరైనా అపహరించి ఉంటారు. లేక సీత నన్ను వెదుక్కుంటూ అరణ్యంలో దారి తప్పిపోయి ఉంటుంది. లేక సీత నన్ను ఆట పట్టించడానికి ఎక్కడైనా దాక్కుని ఉంటుంది. లేదా పుష్పములు ఫలములు తీసుకురావడానికి ఆడవిలోకి వెళ్లి ఉంటుందేమో! సీతకు తామర పూలుఅంటే ఇష్టం. వాటిని కోయడానికి సరస్సు వద్దకు వెళ్ళిందేమో. లేక సీత నీరు
తీసుకురావడానికి గోదావరి తీరాననికివెళ్లి ఉంటుందా!” ఇలా పరి పరి విధములుగా ఆలోచిస్తూ ఆ ప్రాంతం అంటా కలయ తిరుగుతున్నాడు రాముడు.
ఒక చెట్టు దగ్గర నుండి మరొక చెట్టు వద్దకు, ఒక కొండ నుండి మరొక కొండవద్దకు, ఒక కాలువ నుండి మరొక కాలువ వద్దకు తిరుగుతున్నాడు. పొదలు,పుట్టలు గుట్టలువెదుకుతున్నాడు. చెట్లను అడుగుతున్నాడు. సీతకు ఇష్టమైనపూలమొక్కలను అడుగుతున్నాడు. పూలను అడుగుతున్నాడు. పిచ్చివాడి వలె వాటితో మాట్లాడుతున్నాడు. ఏడుస్తున్నాడు. చెట్లు, పుట్టలు, మొక్కలు అయిపోయిన తరువాత అక్కడ ఉన్న సీత పెంపుడు జంతువులను అడుగుతున్నాడు. జింకలను, ఏనుగులను అడుగుతున్నాడు. తరువాత సీత తనకళ్ల ఎదురుగా ఉన్నట్టు ఊహించు
కుంటూ తనలో తాను మాట్లాడుకుంటున్నాడు. సీత పరుగెత్తుతున్నట్టు ఊహించుకుంటూ ఆమెను ఆగమని అరుస్తున్నాడు. అంతలోనే నిరాశ. సీతను ఎవరో చంపేసి ఉంటారు అని కుమిలిపోతున్నాడు. రాక్షసులు ఆమెను చంపేటప్పుడు, గొంతునులిమే టప్పుడు సీత ఎలా బాధపడి ఉంటుందో తలచుకుంటూ ఏడుస్తున్నాడు. "సీతను నేను రాక్షసులకు ఆహారంగా వదిలి వెళ్లినట్టున్నాను.” అని అనుకుంటూ కుమిలి పోతున్నాడు.
లక్ష్మణునిపట్టుకొని "లక్ష్మణా! సీతనీకు ఎక్కడైనా కనిపించిందా" అని నిలదీసి అడుగుతున్నాడు. దాదాపు ఉన్మత్త స్థితిలో ఉన్నాడు రాముడు.
శ్రీమద్రామాయణము.
అరణ్యకాండము అరువదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓంతత్సత్
Comments
Post a Comment