Posts

Showing posts from June, 2024

శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - ఇరువది ఒకటవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 21)

శ్రీమద్రామాయణము కిష్కింధా కాండము ఇరువది ఒకటవ సర్గ తార అలా ఏడుస్తుంటే హనుమంతుడు ముందుకు వచ్చి ఆమెను ఓదారుస్తున్నాడు. “అమ్మా! తారా! మనము చేసిన కర్మలను బట్టి ఫలితాలు వస్తుంటాయి. వాలి తాను చేసిన అకృత్యములకు ఫలితము అనుభవించాడు. దీనికి చింతించి ప్రయోజనము లేదు. ఈ దేహములు నీటి బుడగలు. కాలానుగుణంగా అవి బద్దలు అవుతుంటాయి. అందరూ ఎప్పుడో ఒకప్పుడు పోవలసిన వారమే. పోయిన వాలి గురించి విచారించే కంటే బతికి ఉన్న అంగదుని క్షేమం గురించి విచారించు. పుట్టిన ప్రతి ప్రాణీ చావక తప్పదు. కాబట్టి చనిపోయిన వారి గురించి ఆలోచించక, నీ శేషజీవితములో శుభం కలగాలని కోరుకో! అదే ప్రస్తుత కర్తవ్యము. ఇప్పటి దాకా ఈ కిష్కింధలో ఉన్న వేలకొలది వానరులు వాలి సంరక్షణలో హాయిగా జీవించారు. ఇప్పుడు వాలి లేడు. స్వర్గమునకు వెళ్లాడు. స్వర్గసుఖములు అనుభవించుచున్న వాలి గురించి దు:ఖించడం అవివేకము. ఈ కిష్కింధలో ఉన్న వేలాది వానరులకు, భల్లూకములకు వాలి మరణానంతరము నీవు, అంగదుడు రక్షకులు. అంగదునికి పట్టాభిషేకము చేస్తాము. నీ సంరక్షణలో అంగదుడు రాజ్యము చేస్తాడు. తదుపరి కార్యక్రమములు నిర్వర్తించమని సుగ్రీవునికి ఆదేశములు ఇవ్వు. ఇప్పుడు అంగదుడు, సుగ్రీవుడు...

శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - ఇరవదవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 20)

శ్రీమద్రామాయణము కిష్కింధా కాండము ఇరవదవ సర్గ రాముని బాణం దెబ్బతిని చావుబతుకుల్లో ఉన్న భర్త వాలిని చూచి తార భోరున ఏడిచింది. “ఓ వీరుడా! నీవు లోకోత్తర వీరుడవే. నీ వీరత్వము, పరాక్రమము ఏమైపోయాయి. ఎందుకు ఇలా దీనంగా నేల మీద పడి ఉన్నావు. నేను, నీ భార్య తారను, వచ్చాను. లే. నన్ను పలకరించు. నీవు మహారాజువు. ఇలా నేల మీద పడుకోవడం తగునా. లేచి మెత్తని హంసతూలికా తల్పం మీద పడుకో. ఓ భూనాధా! ఇన్నాళ్లు ఈ భూమిని పాలించిన నీవు, అవసాన సమయంలోకూడా భూదేవిని వదల లేక. ఆమెను కౌగలించుకొని పడుకున్నావా! ఓ వానరవీరా! ఎంతో కష్టపడి, స్వర్గాన్ని తలదన్నే విధంగా, ఈ కిష్కింధను నిర్మించావు. ఇప్పుడు ఆ కిష్కింధను వదిలి ఎక్కడకు పోతున్నావు? నాధా! నేను నీ వియోగము తట్టుకోలేకున్నాను. నన్ను విడిచి వెళ్లవద్దు. నిన్ను ఈ స్థితిలో చూచి కూడా నా హృదయం బద్దలు కాలేదంటే, నా గుండె కఠినమైన పాషాణము అనుకుంటాను. అయినా కాలగతిని ఎవరు తప్పించగలరు. ఈ కాలమే నిన్ను సుగ్రీవుని చేతిలో మరణించేట్టు చేసింది. నాధా! నేను నీకు భార్యగా ఉన్నాను. నేను కాకుండా ఎంతో మంది స్త్రీలు ఉన్నారు కదా! కానీ నీవు ఆ సుగ్రీవుని భార్యను కోరుకున్నావు. అతనిని రాజ్యము నుండి వెళ్లగొట్ట...

శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - పంతొమ్మిదవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 19)

శ్రీమద్రామాయణము కిష్కింధా కాండము పంతొమ్మిదవ సర్గ వాలిని రాముడు తన బాణంతో కొట్టడం, వాలి పడిపోవడం, చనిపోయే స్థితిలో ఉండటం వాలి భార్య తారకు తెలిసింది. వాలి, తారల కుమారుడు అంగదుడు ఆమె పక్కనేఉన్నాడు. తార, అంగదులు వాలి దుర్మరణానికి ఎంతో దు:ఖించారు. వాలి దగ్గరకు పరుగు పరుగున వస్తున్నారు. అప్పటికే, ధనుస్సును ధరించి, కాలయముని మాదిరి నిలబడి ఉన్న రాముని చూచి వానరులు అందరూ పారిపోయారు. పారి పోతున్న వానరులను చూచింది తార. తార వారిని చూచి ఇలా పలికింది. "ఓ వానరులారా! ఇప్పటి వరకూ మీరు మీ రాజు వాలి వెంట ఉండే వాళ్లు కదా. ఇప్పుడు ఎందుకు ఇలా పారిపోతున్నారు. రాజ్యం కోసరం సుగ్రీవుడు, తాను ఏమీ చేయలేక, రాముని సాయంతో మీ రాజు వాలిని చంపించాడు. మీరు ఎందుకు పారిపోతున్నారు? భయపడకండి. పారిపోకండి. నాతో రండి." అని అన్నది తార. పారిపోతున్న వానరులు తార మాటలు విని వెనక్కు తిరిగి వచ్చారు. తారను చూచి ఇలా అన్నారు. “అమ్మా తారా! ముందు నీవు, నీ కుమారుడు అంగదుడిని రక్షించుకో. లేకపోతే రాముడు అంగదుడిని కూడా చంపుతాడు. సుగ్రీవునికి అడ్డం లేకుండా చేస్తాడు. రాముడు వాలిని చంపగానే, మేమందరమూ భయంతో పారిపోయాము. అమ్మా తారా! నీవు అం...

శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - పదునెనిమిదవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 18)

శ్రీమద్రామాయణము కిష్కింధా కాండము పదునెనిమిదవ సర్గ వాలి అన్న మాటలు అన్నీ ఓపికగా విన్నాడు రాముడు. వాలి మౌనం వహించగానే రాముడు వాలి చేసిన ఆరోపణలను అన్నీ సమర్థవంతంగా తిప్పికొట్టాడు. "ఓ వాలీ! నీకు ధర్మము, అర్థము, కామము అంటే ఏమిటో తెలియవు. లోక మర్యాదలు తెలియవు. నన్ను మాత్రము నీ ఇష్టం వచ్చినట్టు నిందించావు. నాతో మాట్లాడే ముందు. నన్ను నిందించే ముందు, నీవు నీ పెద్దలతో, పండితులతో చర్చించి ఉండాల్సింది. ఈ అరణ్యములు, పర్వతములు, సమస్తజంతుజాలము అన్నీ ఇక్ష్వాకు వంశపు రాజులకు చెందినవి. ఈ అడవిలోని జంతు జాలమును. మనుష్యులను, రాక్షసులను రక్షించడానికి కానీ, శిక్షించడానికి కానీ, ఇక్ష్వాకు వంశము రాజులకే అధికారము కలదు. ప్రస్తుతము ఈ భూమినంతా భరతుడు పరిపాలిస్తున్నాడు. అతడు నిత్యసత్యవ్రతుడు. ధర్మము తెలిసినవాడు. దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేయగల సమర్ధుడు. భరతుడు దేశ, కాల, మాన పరిస్థితులను గుర్తెరిగి పాలించే రాజు. భరతుని ఆజ్ఞమేరకు, ధర్మరక్షణ చేయుటకు, మేము ఈ ప్రాంతం అంతా సంచరిస్తున్నాము. ధర్మనిరతుడైన భరతుని పాలనలో అధర్మమునకు తావు లేదు. ధర్మవిరుద్ధముగా ఎవరూ ప్రవర్తించరు. కాని మేము భరతుని ఆజ్ఞమేరకు ధర్మవిరుద్ధముగా ప్ర...

శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - పదునేడవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 17)

శ్రీమద్రామాయణము కిష్కింధా కాండము పదునేడవ సర్గ రాముని బాణం దెబ్బ తిన్న వాలినేల మీద పడిపోయాడు. శరీరం పడిపోయింది కానీ అతని తేజస్సు తగ్గలేదు. వాలి మెడలో ఉన్న ఇంద్రమాల, అతని గుండెల్లో గుచ్చుకున్న రామ బాణము అతనిలో ఉన్న తేజస్సును సడలిపోనివ్వడం లేదు. తన బాణము దెబ్బకు వాలి పడి పోగానే, రాముడు, లక్ష్మణుడు వాలి దగ్గరకు వెళ్లారు. వాలి ముందు గౌరవ సూచకంగా తలవంచి నిలబడ్డారు. కొన ఊపిరితో ఉన్న వాలి రాముని చూచాడు. యుద్ధంలో గెలిచాను అన్న గర్వంతో ఉన్న రామునితో తనలో ఉన్న గర్వం తగ్గని వాలి ఇలా అన్నాడు. వాలి మాటల్లో రాముని పట్ల వినయం ఉంది. కాని పౌరుషం తగ్గలేదు. ధర్మబద్ధంగా మాట్లాడుతున్నాడు వాలి. “నేను సుగ్రీవునితో యుద్ధం చేస్తూ నీ మూలంగా మరణిస్తున్నాను. నేను నీతో యుద్ధం చేయడం లేదు కదా! నీవంక తిరిగి నీతో యుద్ధం చేయని వాడిని చంపి నీవు ఏం సాధించావు? నేను విన్నదానిని బట్టి రాముడు కులీనుడు. సత్త్వగుణ సంపన్నుడు. తేజస్వి. వ్రతనిష్ట కలవాడు. రాముడు కరుణామయుడు. ఎల్లప్పుడూ ప్రజలహితం కోరేవాడు. ఇతరుల పట్ల జాలి, దయ కలవాడు. ఉత్సాహవంతుడు. సమయస్ఫూర్తి కలవాడు. ధృడమైన బుద్ధికలవాడు. ఈ లోకంలో ఉన్న వారంతా నిన్ను పై గుణములతో కీర్తి...

శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - పదునారవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 16)

శ్రీమద్రామాయణము కిష్కింధా కాండము పదునారవ సర్గ తార చెప్పిన మాటలు వాలి పెడచెవిని పెట్టాడు. తారను నాకు చెప్పేంత దానివా అని కసురుకున్నాడు. విదిలించి కొట్టాడు. పురుషాహంకారము అతని ఆలోచనా శక్తిని హరించి వేసింది. “నా కన్నా బలహీనుడు నన్ను యుద్ధానికి రమ్మని పిలుస్తుంటే నేను ముందూ వెనకా ఆలోచిస్తూ కూర్చోవాలా! కుదరదు. నీవు భయస్తురాలవు. పిరికిదానికి. నా వంటి వీరుడు శూరుడు యుద్ధానికి వెనుదియ్యడం కన్నా మరణించడం మేలు. శత్రువు యుద్ధానికి కాలు దువ్వుతుంటే, ఓర్పుతో ఉండటం మరణం కన్నా సహించరానిది. ఇంక రాముని గూర్చి నాకు భయం లేదు. నీవే అన్నావు కదా. రాముడు ధర్మాత్ముడు. ఆర్తజనులను రక్షించేవాడు అని. అటువంటి రాముడు అధర్మానికి ఎలా ఒడిగడతాడు. సుగ్రీవుని కోసరం పాపం ఎలా చేస్తాడు? ఏదో స్త్రీసహజమైన చాపల్యంతో నీకు తోచింది చెప్పావు. ఇంకచాలు లోపలకు వెళ్లు. పిచ్చిదానా! నేను నా సోదరుని చంపుతాను అనుకున్నావా! లేదు. నేను కేవలం సుగ్రీవుని అహంకారము అణిచి బుద్ధి చెప్పి పంపేస్తాను. అంతే. ప్రస్తుతము సుగ్రీవుడు రాజ్యం కోరడం లేదు. యుద్ధం కోరుకుంటున్నాడు. వాడు కోరుకున్న యుద్ధాన్ని వాడికి ఇస్తాను. నీకు నా మీద ఉన్న ప్రేమకొద్దీ, నీ బుద్ధ...

శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - పదునైదవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 15)

శ్రీమద్రామాయణము కిష్కింధా కాండము పదునైదవ సర్గ వాలి అంతఃపురంలో తన భార్య వద్ద ఉన్నాడు. ఇంతలో సుగ్రీవుని అరుపులు గావు కేకలు వినిపించాయి. దిగ్గున లేచాడు వాలి. సేవించిన మద్యం మత్తు దిగిపోయింది. కోపం వచ్చింది. యుద్ధానికి సన్నద్ధం అయ్యాడు. అంత: పురము నుండి బయటకు వచ్చాడు. వాలి వెంట ఆయన భార్య తార కూడా వచ్చింది. వాలిని వారించింది. వాలిని ప్రేమతో కౌగలించుకొని ఇలా చెప్పింది. “నాధా! నీకు అకాల కోపము పనికి రాదు. కోపము వదిలిపెట్టి ప్రశాంతంగా ఆలోచించు. ఇప్పుడే యుద్ధం చెయ్యాలా. రేపు చెయ్యవచ్చు కదా! నీ శత్రువు ఎక్కడకు పోడుకదా! పైగా యుద్ధానికి వచ్చింది ఒక్కడే కానీ పదిమంది కాదుకదా! నీవు పరాక్రమము లేని వాడవు, దుర్బలుడవు కాదు కదా! అయినా నీవు అకాలంలో యుద్ధమునకు పోవడం నాకు ఎంత మాత్రమూ ఇష్టం లేదు. దానికి కారణం చెబుతాను విను. ఇంతకు ముందే నీవు నీ తమ్ముని సుగ్రీవుని యుద్ధంలో ఓడించావు. చావగొట్టి పంపించావు. చావు తప్పి పారిపోయాడు సుగ్రీవుడు. కాని వెంటనే యుద్ధానికి వచ్చాడు. ఈ కొద్దికాలంలో అతని బలం ఎలా పెరిగింది. ఆలోచించు. ఇంత కొద్దికాలంలో అతను నీ కన్నా బలవంతుడు అయ్యాడంటే నాకు నమ్మకం కుదరం లేదు. ఇందులో ఏదో మోసం ఉంద...

శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - పదునాల్గవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 14)

శ్రీమద్రామాయణము కిష్కింధా కాండము పదునాల్గవ సర్గ అందరూ కిష్కింధా నగరము ప్రవేశించారు. సుగ్రీవుడు రామునితో ఇలా అన్నాడు.“రామా! ఇదే కిష్కింధా నగరము. ఇక్కడ ద్వారములు అన్నీ బంగారంతో నిర్మించారు. ఇక్కడ అనేక యంత్రములు అమర్చబడ్డాయి. వాలిని చంపడానికి తగిన కాలము సమీపించింది. నీవు దానిని సఫలం చేస్తావని ఆశిస్తున్నాను.” అని అనుమానంగా అన్నాడు సుగ్రీవుడు. సుగ్రీవుని మనసులోని సందేహాన్ని గ్రహించాడు రాముడు. అతని మనసులోని సందేహ నివృత్తి కోసరం ఇలా అన్నాడు. “సుగ్రీవా! ఈ సారి వాలిని గుర్తు పట్టడంలో పొరపాటు జరగదు. ఎందుకంటే నీ మెడలో ఉన్న గజమాల నువ్వు సుగ్రీవుడు అని తెలియజేస్తుంది. ఒకే ఒక బాణంతో నేను వాలిని చంపుతాను. నీవు నిశ్చింతగా ఉండు. ఈ సారి వాలి నా కంటబడి తప్పించుకుంటే, నువ్వు నన్ను తప్పు పట్టు. నన్ను నిందించు. నీ ఎదురుగానే కదా నేను ఏడు సాలవృక్షములను ఛేధించాను. ఈ వాలిని చంపడం పెద్ద కష్టమేమీ కాదు. నన్ను నమ్ము. నేను ఎన్ని కష్టములలో ఉన్నా ఎప్పుడూ అసత్యము చెప్పలేదు. ఇక మీదట కూడా అసత్యము చెప్పను. చెప్పలేను. నేను నా ప్రతిజ్ఞను నెరవేర్చుకుంటాను. ఇది సత్యము. నీలోని భయాన్ని వదిలిపెట్టు. ధైర్యంగా వాలితో యుద్ధం చెయ్యి...

శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - పదమూడవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 13)

శ్రీమద్రామాయణము కిష్కింధా కాండము పదమూడవ సర్గ అందరూ కిష్కింధకు వెళుతున్నారు. ముందు లక్ష్మణుడు నడుస్తున్నాడు. తరువాత ధనుర్ధారియై రాముడు నడుస్తున్నాడు. రాముని వెనక సుగ్రీవుడు, హనుమంతుడు, నలుడు, నీలుడు, తారుడు నడుస్తున్నారు. వారుకొండలను గుహలను, సరస్సులను దాటుకుంటూ వెళుతున్నారు. మార్గ మధ్యంలో రాముడు ఒక వనమును చూచాడు. దాని గురించి సుగ్రీవుని అడిగాడు. సుగ్రీవుడు ఆ వనము గురించి ఇలా చెప్పసాగాడు. "ఓ రామా! ఇక్కడ సప్తజనులు అనే మునులు ఉండేవారు. వారు జలములో తలకిందులుగా తపస్సు చేస్తూ ఉండేవారు. వారు ఆహారము తీసుకొనేవారు కాదు. ఏడురోజులకొక సారి గాలి మాత్రం పీల్చుకొనే వారు. ఆ ప్రకారంగా వారు ఏడు వందల సంవత్సరములు తపస్సుచేసి శరీరంతో స్వర్గమును చేరుకున్నారు. ఆ మునుల తపస్సు ప్రభావంతో ఈ వనములోకి దేవతలు గానీ, మనుషులు గానీ, జంతువులు గానీ ప్రవేశించలేవు. ఒకవేళ ప్రవేశిస్తే తిరిగి వెళ్లలేవు. ఈ వనములో నిత్యమూ మూడు అగ్నిహోత్రములు అనగా దక్షిణాగ్ని, గార్హపత్యము, ఆహవనీయము మండుతూ ఉంటాయి. వాటినుండి వెలవడే పొగ అదుగో అలా కనపడుతూ ఉంటుంది. రామా! మీరు ఆ మునులకు నమస్కారం చేయండి. మీకు మేలుజరుగుతుంది.” అని అన్నాడు సుగ్రీవుడు. ...

శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - పన్నెండవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 12)

శ్రీమద్రామాయణము కిష్కింధాకాండము పన్నెండవ సర్గ సుగ్రీవుని మాటలను విన్న రాముడు, అతని మనసులో ఉన్న సందేహమును నివారించ నిశ్చయించుకున్నాడు. మారుమాటాడ కుండా తన ధనుస్సును చేత బట్టుకున్నాడు. శరమును సంధించాడు. ఒకే ఒక బాణంతో ఒక సాల వృక్షము కాదు, వరుసగా ఉన్న ఏడు సాలవృక్షములను పడగొట్టాడు. సుగ్రీవునికి నోట మాట రాలేదు. ఆశ్చర్యపోయాడు. తాను ఒక్క వృక్షమును కొట్ట మంటే ఏడు వృక్షములను కొట్టాడు రాముడు. రాముని కాళ్ల మీద సాష్టాంగ పడ్డాడు. “రామా! చాలు చాలు. నీవు సాక్షాత్తు ఇంద్రుడినే చంపగల సమర్ధుడవు. నీకు వాలి ఒక లెక్కా! ఏడు సాలవృక్షములను కూల్చిన నీముందు ఎవడు నిలిచి యుద్ధము చేయగలడు? నీవు నాకు మిత్రుడుగా లభించినందుకు నా మనసంతా ఆనందంతో నిండి పోయింది. రామా! చేతులు జోడించి ప్రార్ధిస్తున్నాను. వాలిని చంపి నాకు మనశ్శాంతిని చేకూర్చు." అని అన్నాడు సుగ్రీవుడు. "మిత్రమా! సుగ్రీవా! నీవు చెప్పినట్టే చేద్దాము. ముందు నీవు కిష్కింధకు వెళ్లు. నీ వెనువెంటనే మేము వస్తాము. నీవు వెళ్లి వాలిని యుద్ధానికి రమ్మని పిలువు. వాలితో యుద్ధము చెయ్యి. నేను చాటుగా ఉంది నా బాణముతో వాలిని చంపుతాను." అని అన్నాడు రాముడు. రాముని మా...

శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - పదకొండవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 11)

శ్రీమద్రామాయణము కిష్కింధాకాండము పదకొండవ సర్గ తనలో సంతోషాన్ని వృద్ధి చెందేట్టు రాముడు పలికిన మాటలకు సుగ్రీవుడు ఎంతో ఆనందించాడు. “రామా! నాకు ఆ మాత్రం తెలియదా! నీకు కోపం వస్తే ముల్లోకములనే భస్మం చేయగల శక్తి, సామర్థ్యము నీకు ఉంది. కాని వాలికి ఎంత పౌరుషము, పరాక్రమము ఉందో తెలుసుకొని దానికి తగ్గట్టుగా చేయమని నా కోరిక. రామా! వాలి సూర్యోదయానికి ముందే లేచి, ఏ మాత్రం శ్రమలేకుండా నాలుగు సముద్రములకు వెళ్లి, సంధ్యావందనము చేస్తాడు. (ఇక్కడ ఒక చమత్కారము ఉంది. కన్యాకుమారి దగ్గరకు వెళితే, మూడు సముద్రాలు పక్క పక్కనే ఉన్నాయి. ఇంక నాలుగో సముద్రం అప్పట్లో ఉందేమో తెలియదు. ప్రస్తుతం హిమాలయాలు ఉన్నాయి. కాబట్టి అది అతిశయోక్తి కావచ్చును. పైగా పంపానది, ఋష్యమూకము కన్యాకుమారికి దగ్గరగానే ఉన్నాయి. వాలి ఏ మాత్రం శ్రమ లేకుండా మూడు సముద్రాలలో సంధ్యావందనము చేసాడు అనేది సంభవమే కదా!). వాలి పర్వతముల మీద ఎక్కి పెద్ద పెద్ద రాళ్లను బంతుల మాదిరి పైకి ఎగరవేసి ఆడుకుంటూ ఉంటాడు. వాలి తన బల ప్రదర్శన కొరకు పెద్ద పెద్ద వృక్షములను పెకలించి వేస్తూ ఉంటాడు. దుందుభి అనే రాక్షసుడు ఉండేవాడు. వాడు మహా బలవంతుడు. పెద్ద కొండ వంటి శరీరము కలవాడు. ...

శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - పదవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 10)

శ్రీమద్రామాయణము కిష్కింధాకాండము పదవ సర్గ నేను నా అన్నకు జరిగిన విషయము వివరంగా చెప్పాను. నా మీద కోపగించవద్దని బతిమాలుకున్నాను. “అన్నయ్యా! నేను చెప్పేది విను. నీవు మన శత్రువును సంహరించి విజయోత్సాహంతో తిరిగి వచ్చావు. నాకు చాలా సంతోషంగా ఉంది. మా కందరికీ ఇప్పటికీ నీవే రక్షకుడవు. నీవే ఈ సింహాసనము అధిష్టించు. నేను నీ వెనక నిలబడి ఛత్రము పట్టి నిల్చుంటాను. అన్నా! నీవు ఆదేశించినట్టు నేను ఆ బిలము బయట ఒక సంవత్సరము పాటు వేచి ఉన్నాను. నీవు రాలేదు. ఇంతలో ఆ బిలము లో నుండి రక్తం ఏరులుగా ప్రవహించింది. అది చూచి నాకు భయం వేసింది. నిన్ను ఆ రాక్షసుడు చంపి ఉంటాడని అనుకున్నాను. ఆ బిలమును పెద్ద పెద్ద బండరాళ్లతో మూసివేసాను. కిష్కింధకు తిరిగి వచ్చాను. నేను ఎంత వద్దన్నా, ఈ మంత్రులు నన్ను రాజును చేసారు. అది జరిగిన సంగతి. నేను ఈ కిష్కింధకు రాజుగా తగను. నీవే రాజువు. నీవు వచ్చేవరకూ నేను ఈ రాజ్యాన్ని నీ బదులు సంరక్షిస్తూ ఉన్నాను. ఇప్పుడు నీ రాజ్యమును నీకు అప్పగిస్తున్నాను. నేను ఇదివరకటి మాదిరి నిన్ను సేవిస్తూ ఉంటాను. నా మీద కోపించకు. శాంతం వహించు. నీ పాదాల పడి ప్రార్థిస్తున్నాను. అన్నయ్యా! మరొకసారి చెబుతున్నాను. నేను ...

శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - తొమ్మిదవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 9)

శ్రీమద్రామాయణము కిష్కింధా కాండము తొమ్మిదవ సర్గ “రామా! వాలి, నేను, అన్నదమ్ములము. వాలి అంటే మా నాన్న గారికి ఎంతో ప్రేమ. నాకు కూడా వాలి అంటే ఎంతో ప్రేమ, అభిమానము. నా తండ్రి గారు చనిపోయిన తరువాత, పెద్ద కుమారుడు అయిన వాలిని కిష్కింధా రాజ్యమునకు పట్టాభిషిక్తుని చేసారు. వంశపారంపర్యముగా వచ్చిన రాజ్యమును వాలి పరిపాలిస్తూ ఉంటే, నేను వాలికి సేవకునిలా అతనిని సేవించేవాడిని. మయునికి ఇద్దరు కుమారులు. వారు మాయావి, దుందుభి. మాయావికి, మా అన్న వాలికి ఒక స్త్రీమూలకంగా విరోధము ఏర్పడింది. ఒకరోజు అర్థ రాత్రి అందరమూ నిద్రపోతున్నాము. అప్పుడు మాయావి మా కోట వద్దకు వచ్చి పెద్దగా అరుస్తూ వాలిని యుద్ధానికి పిలిచాడు. పరాక్రమ వంతుడైన వాలి మాయావితో యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు. అర్థరాత్రి శత్రువు యుద్ధానికి వచ్చాడంటే అందులో ఏదో మర్మం ఉంటుందని ఎంత నచ్చచెప్పినా వినకుండా వాలి మాయావితో యుద్ధానికి వెళ్లాడు. నేను కూడా వాలితో పాటు వెళ్లాను. మా ఇద్దరినీ చూచి మాయావి పారిపోయాడు. నేను, వాలి, మా అనుచరులతో మాయావిని వెంబడించాము. ఆ మాయావి భూమిలో ఉన్న సొరంగములోకి ప్రవేశించాడు. ఆ సొరంగము గడ్డితో కప్పబడి ఉంది. నేను వాలి బయట నిలబడ్డాము. అ...

శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - ఎనిమిదవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 8)

శ్రీమద్రామాయణము కిష్కింధాకాండము ఎనిమిదవ సర్గ అలా మాట్లాడు కోడంలో సుగ్రీవుడు తనకూ, తన అన్న వాలికి శత్రుత్వము ఎందుకు వచ్చిందీ అన్న విషయం రామునితో చెప్పసాగాడు. “ఓ రామా! నీవు నా స్నేహితుడవు కావడం నా అదృష్టం. దేవతలు నా మీద కరుణ చూపడం వలననే నీవు నా మిత్రుడివి అయ్యావు. నీవు నాకు మిత్రుడుగా, నాకు అండగా ఉంటే నేను ఒక్క కిష్కింధా రాజ్యమే కాదు, స్వర్గలోక ఆధిపత్యము కూడా పొందగలను. ఓ రామా! నీతో స్నేహం చేయడం వలన నాకు నా బంధుమిత్రులలో గౌరవం పెరిగింది. నా గురించి, నా గుణగణముల గురించి నేను చెప్పుకోకూడదు కానీ, నేను నీకు మంచి స్నేహితుడిని అవుతాను అని మాత్రం చెప్పగలను. ఎందు కంటే అతడు ధనికుడైనా, పేద వాడైనా, సుఖాలలో మునిగి తేలుతున్నా, దు:ఖాలలో కుంగి పోతున్నా, మంచి వాడైనా, చెడ్డ వాడైనా, ఎటువంటి వాడికైనా స్నేహితుడే దిక్కు. స్నేహమునకు మించినది ఈ లోకములో ఏదీ లేదు. స్నేహాన్ని గురించి బాగా తెలిసిన వాళ్లు తన స్నేహితుని కొరకు ధనమును గానీ, సుఖములను గానీ, సంపదలను కానీ ఆఖరుకు ఉన్న ఊరును కానీ, త్యజించుటకు వెనుకాడరు. అటువంటి స్నేహము మనది."అని అన్నాడు సుగ్రీవుడు. రాముడు నవ్వి "మిత్రమా! నువ్వు చెప్పినది యదార్థము.”...

శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - ఏడవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 7)

శ్రీమద్రామాయణము కిష్కింధాకాండము ఏడవ సర్గ రాముని పలుకులు విన్న తరువాత సుగ్రీవునకు కూడా దు:ఖము ముంచుకొచ్చింది. దుఃఖముతో పూడుకుపోయిన గొంతుతో సుగ్రీవుడు ఇలా అన్నాడు. “రామా! సీతను అపహరించిన ఆ రాక్షసుని నివాసము గానీ, వాడి పరాక్రమము గానీ, బలము కానీ నాకు తెలియదు. కాని నా శాయశక్తులా ప్రయత్నించి వాడిని గురించి తెలుసుకుంటాను. నీ దు:ఖమును విడిచి పెట్టు. నన్ను నమ్ము. నిశ్చింతగా ఉండు. నీ భార్యను నీకు తెచ్చి ఇచ్చే బాధ్యత నాది. ఇదే నా ప్రతిజ్ఞ. నీవు అతి త్వరలో సీతను అపహరించిన ఆ రావణుడు అనే రాక్షసుని చంపి సీతను పొందు తావు. కాని ముందు నీవు ఈ దుఃఖమును, దీనత్వమును, వదిలి పెట్టు. ధైర్యము అవలంబించు. నీ పరాక్రమాన్ని, వీరత్వాన్ని గుర్తుకు తెచ్చుకో. నీ వలెనే నా భార్యను కూడా ఎత్తుకు పోయారు. కానీ నేను నీ వలె దు:ఖించడం లేదు. క్రుంగి పోవడం లేదు. ధైర్యము విడిచి పెట్టలేదు. నా భార్యను ఎత్తుకుపోయిన వాలిని ఎలా చంపాలా అని ఆలోచిస్తున్నాను. నా వంటి సాధారణ వానరుడే పోయిన భార్యను గురించి చింతించడం లేదంటే ఇంక నీ వంటి ధీరోదాత్తుడు, పరాక్రమవంతుడు, పండితుడు ఇలా దీనంగా భార్యకోసరం ధైర్యాన్ని విడనాడి దు:ఖించడం ఏమాత్రం తగదు. బుద్ధిమ...

శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - ఆరవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 6)

శ్రీమద్రామాయణము కిష్కింధా కాండము ఆరవ సర్గ సుగ్రీవుడు రాముని చూచి ఇలా అన్నాడు. “రామా! నీ గురించి హనుమంతుడు నాకు అంతా చెప్పాడు. నీవు నీ సోదరుడు లక్ష్మణుడు ఈ అరణ్యవాసము ఎందుకు చేస్తున్నారో వివరంగా చెప్పాడు. నీ భార్య సీతను మీరు లేని సమయమున ఒక రాక్షసుడు అపహరించిన విషయం కూడా చెప్పాడు. నీవు నాకు మిత్రుడవు అయినావు. ఇంక నీ దు:ఖమును విడిచి పెట్టు. నీ భార్య ఎక్కడ ఉన్నా వెతికి తీసుకొని వచ్చి నీకు అప్పగిస్తాను. నీ దుఃఖాన్ని తొలగిస్తాను. నీ భార్య ఆకాశములో ఉన్నా, పాతాళములో ఉన్నా వెతికి తీసుకొని వస్తాను. ఇది సత్యము. నేను మాట తప్పను. రామా! నీవు చెబుతుంటే నాకు ఒక విషయం గుర్తుకు వస్తూ ఉంది. ఒక రోజు మేమందరమూ ఈ పర్వత శిఖరము మీద కూర్చుని ఉండగా ఒక రాక్షసుడు ఒక స్త్రీని అపహరించుకు పోవడం, ఆమె రామా, రామా అని అరవడం మేము చూచాము. ఆమె సీతయే. సందేహము లేదు. ఆ రాక్షసుడు రావణుడు అయి ఉంటాడు. ఆమె అలా ఏడుస్తూ తన పైనున్న వస్త్రములో కొన్ని ఆభరణములను మూటగా కట్టి జారవిడిచినది. ఆ మూట మా దగ్గర పడింది. మేము వాటిని మా దగ్గరే ఉంచాము. వాటిని నీకు చూపిస్తాను. ఆ ఆభరణములను నీవు గుర్తు పట్టగలవేమో చూడు.”అని అన్నాడు సుగ్రీవుడు. ఆ మాటలు వ...

శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - ఐదవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 5)

శ్రీమద్రామాయణము కిష్కింధా కాండము ఐదవ సర్గ హనుమంతుడు రామలక్ష్మణులను తన బుజముల మీద ఎక్కించుకొని ఋష్యమూక పర్వతము నుండి మలయ పర్వతమునకు తీసుకొని వెళ్లాడు. రామలక్ష్మణులను మలయపర్వతము మీద దించి, సుగ్రీవుని వద్దకు వెళ్లాడు. “ఓ సుగ్రీవా! వీరు రాముడు లక్ష్మణుడు అనే పేర్లు గల రాజకుమారులు. నేనే వీరిని నా వెంట తీసుకొని వచ్చాను. రాముడు మహా పరాక్రమ వంతుడు. రాముడు ఇక్ష్వాకు వంశములో పుట్టిన వాడు. ధర్మము తెలిసిన వాడు. దశరథుని కుమారుడు. తండ్రి ఆజ్ఞప్రకారము వనవాసము చేస్తున్నాడు. రాముడు వనవాసము చేయుచుండగా రావణుడు అనే రాక్షసుడు ఈయన భార్య సీతను అపహరించాడు. ఆ రాముడు ప్రస్తుతము నీ శరణు కోరుతున్నాడు. రాముడు, లక్ష్మణుడు నీతో స్నేహము చేయవలెనని అభిలషిస్తున్నారు. వీరి స్నేహమును అంగీకరించు. దీని వలన మీ ఇద్దరికీ లాభము చేకూరుతుంది. వీరిరువురూ పూజింప తగిన వారు. వీరిని మిత్రులుగా స్వీకరించి పూజించు." అని పలికాడు హనుమంతుడు. ఆ మాటలు విన్న సుగ్రీవుడు చాలా సంతోషించాడు. రాముని చూచి ఇలా అన్నాడు. “ఓ రామా! మీ గుణగణముల గురించి హనుమంతుడు నాతో చెప్పాడు. మీరు ఉత్తమ మానవులు. నేను వానరుడను. ఈ వానరుడితో స్నేహము కోరుతున్నారంటే, ఇది...

శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - నాలుగవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 4)

శ్రీమద్రామాయణము కిష్కింధాకాండము నాలుగవ సర్గ లక్ష్మణుని మాటలు విన్న హనుమంతుడు వారు తమకు శత్రువులు కారనీ, వాలి పంపిన వారు కారనీ, ఒక కార్యము నిమిత్తము తిరుగుతున్నారనీ, వీరి మైత్రితో సుగ్రీవుని కష్టములు కూడా గట్టెక్కుతాయని సంతోషించాడు. వీరు కూడా సుగ్రీవుని వలె కష్టములలో ఉన్నట్టున్నారు. వీరి కష్టములను సుగ్రీవుడు తీర్చగలడు. అప్పుడు వీరు కూడా సుగ్రీవునకు సాయము చెయ్యగలరు. వాలి నుండి సుగ్రీవునికి రాజ్యప్రాప్తి కలుగుతుంది.” అని సంతోషించాడు. తరువాత హనుమంతుడు లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు. “మీరు చూడబోతే మునికుమారులవలె ఉన్నారు. కాని చేతిలో ధనుర్బాణములు ఉన్నవి. మీరు ఎవరికోసమో వెతుకుతున్నట్టు కనపడుతూ ఉంది. మీ గురించి వివరంగా చెప్పండి. మీ మాటలు నేను మా రాజుకు చెప్పాలి కదా!" అని అన్నాడు హనుమంతుడు. అప్పుడు లక్ష్మణుడు హనుమంతునితో ఇలా అన్నాడు. "ఓ హనుమా! ఈయన పేరు రాముడు. ఇక్ష్వాకు వంశములో జన్మించిన అయోధ్యాధిపతి దశరథుని పెద్ద కుమారుడు. గుణవంతుడు, రాజ్యము చేయుటకు అర్హుడు. కాని ఒకానొక కారణమున రామునికి రాజ్యము లభించలేదు. పైగా అరణ్యవాసము సంప్రాప్తించింది. రాముని భార్య పేరు సీత. సూర్యుని విడిచి కాంతి ఉండ...

శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - మూడవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 3)

శ్రీమద్రామాయణము కిష్కింధాకాండము మూడవ సర్గ సుగ్రీవుడు చెప్పిన మాటలను జాగ్రత్తగా విన్నాడు హనుమంతుడు. వెంటనే ఋష్యమూక పర్వతము నుండి రామలక్ష్మణులు ఉన్నచోటికి వెళ్లాడు. హనుమంతుడికి ఆ మానవులు ఎవరో తెలియదు. అందుకని నిజరూపంతో పోకుండా ఒక సన్యాసి వేషము ధరించాడు. రామలక్ష్మణుల ముందుకు వెళ్లాడు. రామ లక్ష్మణులు సన్యాసి వేషములో ఉన్న హనుమంతుని చూచి అభివాదము చేసారు. రామలక్ష్మణులను చూచి హనుమంతుడు ఇలా అన్నాడు. “మీరు ముని కుమారులవలె ఉన్నారు. కాని మీ చేతిలో ధనుర్బాణములు ఉన్నవి. మీరు వీరుల వలె కనపడుతున్నారు. కాని జటాజూటములు ధరించి ఉన్నారు. మీరు ఒకరిని ఒకరు పోలి ఉన్నారు. కవలలవలె ఉన్నారు. మీరు దేవలోకము నుండి దిగివచ్చిన సూర్య చంద్రుల మాదిరి కనపడుతున్నారు. దేవతారూపములలో ఉన్న మానవుల మాదిరి కనపడుతున్నారు. మీరు ఆజానుబాహులుకదా! మరి మీరు ఎటువంటి అలంకారములు ధరించలేదేమి? మిమ్ములను చూస్తుంటే మీరు ఈ భూమండలము అంతా పరిపాలించ గల సమర్థులు అని నమ్ముతున్నాను. మీ గురించి మాకు తెలపండి. ఇంక నా గురించి చెబుతాను వినండి. నా పేరు హనుమంతుడు. వానర రాజు సుగ్రీవుడు మా ప్రభువు. ఈ ఋష్యమూక పర్వతము మీద ఉన్నాడు. ఆయన మీ గురించి తెలుసుకొని రమ్మ...

శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - రెండవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 2)

శ్రీమద్రామాయణము కిష్కింధాకాండము రెండవ సర్గ రామ లక్ష్మణులను చూచి పారి పోయిన సుగ్రీవుడు ఇంకా భయపడుతూనే ఉన్నాడు. ఒక చోట నిలవడం లేదు. అన్ని దిక్కులా చూస్తున్నాడు. రామలక్ష్మణులు ఎటు వైపు నుండి వచ్చి తన మీద దాడి చేస్తారేమోనని భయంతో వణికిపోతున్నాడు. మహాబలవంతులు, ధనుర్బాణములు ధరించిన రామలక్ష్మణులను చూచి సుగ్రీవునకు ధైర్యం సడలిపోయింది. బాగా ఆలోచించాడు. తన బలం గొప్పదా లేక ఆ మానవుల బలం గొప్పదా అని తనలో తాను తర్కించుకుంటున్నాడు. తనతో పాటుగా ఉన్న మంత్రులను పిలిచాడు. వారికి రామలక్ష్మణుల గురించి చెప్పాడు. “అదుగో అటు చూడండి. ఆ మానవులు ఇద్దరూ నారచీరలు కట్టుకొని, ధనుర్బాణములు ధరించి దేనికోసమో వెదుకుతున్నారు. వారు వాలి పంపిన వారు అని నా అనుమానము. లేకపోతే క్రూరమృగములు సంచరించు, మానవులు చొరరాని ఈ దుర్గమారణ్యములో ఈ మానవులకు ఏమి పని. వీరు నిశ్శంశయంగా వాలి నాకోసం పంపినవారే. మనము ఇక్కడి నుండి వేరు చోటికి వెళ్లడం మంచిది." అని అన్నాడు సుగ్రీవుడు. సుగ్రీవుని మాట ప్రకారము ఆ వానరులు అందరూ వేరే ప్రదేశానికి వెళ్లారు. అక్కడ అందరూ వలయాకారంలో కూర్చున్నారు. మధ్యలో సుగ్రీవుడు కూర్చున్నాడు. ఆ వానరులలో హనుమంతుడు అనే పే...

శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - మొదటి సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 1)

శ్రీమద్రామాయణము కిష్కింధా కాండము మొదటి సర్గ రామ లక్ష్మణులు పంపా సరస్సును సమీపించారు. ఆ సరస్సు చూడటానికి చాలా మనోహరంగా ఉంది. సరస్సునిండా పద్మములు,కలువలు వికసించి ఉన్నాయి. ఆ సరస్సు అందాలు చూడగానే రాముని హృదయం అంతా బాధతో నిండి పోయింది. "లక్ష్మణా! ఈ సరస్సు చూడు ఎంత హృదయానందాన్ని కలిగిస్తూ ఉందో. కాని సీతా వియోగంతో బాధపడుతున్న నాకు ఈ సరస్సు అందాలు ఏమాత్రం సంతోషాన్ని కలిగించడం లేదు. సీతా వియోగంతో బాధపడుతున్న నాకు ఈ ప్రకృతి అందాలు ఇంకా దు:ఖమును ఎక్కువ చేస్తున్నాయి. నా మనోవ్యధ ఎప్పుడు తీరుతుందో ఏమో! కాని లక్ష్మణా! ఈ వనములో ఉన్న పుష్పముల మీదినుండి వీచు గాలి మనకు మార్గాయాసమును పూర్తిగా తొలగించినది. లక్ష్మణా! ఆ కోయిలలు చూడు ఎలా కూస్తున్నాయో. సీత కూడా ఆ కోయిల కూతలు విని నన్ను పిలిచి ఆ కోయిల కూతలు నాకూ వినిపించేది. నా సీత నాకు దొరకని పక్షంలో, నా సీతను నేను చూడని పక్షంలో నేను బతికి ఉండటం వృధా! ఇటువంటి సుందర దృశ్యములు ఎన్ని చూచినా సీతను చూచిన దానితో సాటి రావు కదా! పైగా ఈ వసంత ఋతువు దృశ్యములు, ఈ మలయమారుతము, వసంత శోభ నా వ్యధను ఎక్కువ చేస్తున్నాయి. నా సీతను ఆ రాక్షసుడు ఎత్తుకొని పోకపోయి ఉంటే నేను కూ...