శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - పదమూడవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 13)
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము
పదమూడవ సర్గ
అందరూ కిష్కింధకు వెళుతున్నారు. ముందు లక్ష్మణుడు నడుస్తున్నాడు. తరువాత ధనుర్ధారియై రాముడు నడుస్తున్నాడు. రాముని వెనక సుగ్రీవుడు, హనుమంతుడు, నలుడు, నీలుడు, తారుడు నడుస్తున్నారు. వారుకొండలను గుహలను, సరస్సులను దాటుకుంటూ వెళుతున్నారు. మార్గ మధ్యంలో రాముడు ఒక వనమును చూచాడు. దాని గురించి సుగ్రీవుని అడిగాడు. సుగ్రీవుడు ఆ వనము గురించి ఇలా చెప్పసాగాడు."ఓ రామా! ఇక్కడ సప్తజనులు అనే మునులు ఉండేవారు. వారు జలములో తలకిందులుగా తపస్సు చేస్తూ ఉండేవారు. వారు ఆహారము తీసుకొనేవారు కాదు. ఏడురోజులకొక సారి గాలి మాత్రం పీల్చుకొనే వారు. ఆ ప్రకారంగా వారు ఏడు వందల సంవత్సరములు తపస్సుచేసి శరీరంతో స్వర్గమును చేరుకున్నారు. ఆ మునుల తపస్సు ప్రభావంతో ఈ వనములోకి దేవతలు గానీ, మనుషులు గానీ,
జంతువులు గానీ ప్రవేశించలేవు. ఒకవేళ ప్రవేశిస్తే తిరిగి వెళ్లలేవు. ఈ వనములో నిత్యమూ మూడు అగ్నిహోత్రములు అనగా దక్షిణాగ్ని, గార్హపత్యము, ఆహవనీయము మండుతూ ఉంటాయి. వాటినుండి వెలవడే పొగ అదుగో అలా కనపడుతూ ఉంటుంది. రామా! మీరు ఆ మునులకు నమస్కారం చేయండి. మీకు మేలుజరుగుతుంది.” అని అన్నాడు సుగ్రీవుడు.

రాముడు, లక్ష్మణుడు ఆ మునులకు భక్తితో నమస్కరించారు. తరువాత వారందరూ కిష్కింధకు చేరుకున్నారు.
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము పదమూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment