శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - నలుబది ఏడవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 47)
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము
నలుబది ఏడవ సర్గ
సుగ్రీవునిచే ఆజ్ఞాపింప బడ్డ వానర వీరులు నలుదిక్కులకు వెళ్లారు. సుగ్రీవుడు చెప్పిన చోటులన్నీ వెదికారు. పర్వతములు, నదులు, సరస్సులు, అరణ్యములు, కొండ గుహలు గాలించారు. ఎక్కడా సీత గానీ, రావణుడు గానీ కనపడలేదు. సుగ్రీవుడు విధించిన మాసము రోజులు గడిచిపోయినవి. కాని సీత జాడ తెలియలేదు. అందరూ మరలా కిష్కింధకు చేరుకున్నారు. ప్రసవణ పర్వతము మీద ఉన్న సుగ్రీవుని వద్దకు వచ్చారు. తూర్పుదిక్కుకు పోయిన వినతుడు, పడమట దిక్కుకు పోయిన సుషేణుడు, ఉత్తర దిక్కుకు పోయిన శత బలుడు తమ తమ వానర సేనలతో తిరిగి వచ్చారు. రాముని తో కూర్చుని ఉన్న సుగ్రీవుని వద్దకు పోయి ఇలా విన్నవించుకున్నారు.“రాజా! మీరు ఆదేశించినట్టు మేము అందరమూ అన్ని దిక్కులకూ పోయి నదులు, పర్వతములు, అరణ్యములు, గుహలు, అన్నీ వెదికాము. వెదికిన చోటనే మరలా మరలా వెదికాము. కానీ సీత జాడ
తెలియలేదు. కాని మన అంగదుని నాయకత్వంలో హనుమంతుడు మొదలగు వారు ఇంకా తిరిగి రాలేదు. ఈ మూడు దిక్కులలో సీత కనపడలేదు. కాబట్టి తప్పకుండా దక్షిణ దిక్కున ఆమె జాడ తెలియ గలదు. బుద్ధిమంతుడైన హనుమంతుడు సీత జాడ కనుగొనగలడు." అని వినయంగా చెప్పారు.
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము నలుబది ఏడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment