శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - ఇరువది మూడవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 23)

శ్రీమద్రామాయణము

యుద్ధకాండము

ఇరువది మూడవ సర్గ

లంకా ద్వీపములో అడుగు పెట్టగానే రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు. 

"లక్ష్మణా! మన వానర సేనలను వివిధ భాగములుగా, వ్యూహములుగా విభజించి వారిని సమృద్ధిగా ఫలములు, తేనె, జలము దొరుకు స్థలములలో నిలుపు. 

లక్ష్మణా! మనకు కనపడు శకునములను చూస్తుంటే ఇటు వానరులకు అటు రాక్షసులకు మహాభయంకరమైన ఆపద రాబోతుతున్నదని అనిపిస్తూ ఉంది. భూమి కంపిస్తూ ఉంది. ధూళితో కూడిన గాలి చెలరేగుతూ ఉంది. ఆ గాలి దెబ్బకు పర్వత శిఖరములు కంపిస్తున్నాయి. చెట్లు కూలిపోతున్నాయి. ఆకాశము నుండి ఉల్కాపాతము జరుగుతూ ఉంది. అడవి మృగములు తూర్పుదిక్కుగా చూచి వికృతంగా అరుస్తున్నాయి. చంద్రుడు కాంతి విహీనంగా కనపడుతున్నాడు. సూర్యమండలము చుట్టు ఎర్రని వలయము కనపడుతూ ఉంది, మధ్యలో నల్లని మచ్చ కనపడుతున్నాయి. ఇవన్నీ రాబోవు ప్రళయాన్ని సూచిస్తున్నాయి. ఈ యుద్ధభూమి వానరులు, రాక్షసుల రక్తంతో తడిసిపోయే కాలం సమీపిస్తూ ఉంది. యుద్ధము తప్పదు. లంకను ముట్టడించమని వానర సేనలకు ఆదేశాలు ఇవ్వండి." అని పలికాడు రాముడు. 

తన ధనుస్సు తీసుకొని లంకా నగరం దిశగా వెళ్లాడు రాముడు. విభీషణుడు, సుగ్రీవుడు వానర సేనలతో రాముని అనుసరించారు.

శ్రీమద్రామాయణము
యుద్ధకాండము ఇరువది మూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)