శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - పదునారవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 16)
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము
పదునారవ సర్గ
విభీషణుడు చెప్పిన హితకరమైన మాటలు రావణునికి రుచించలేదు. పైగా కోపం కూడా వచ్చింది.“విభీషణా! నీవు నాకు బంధువు కావు. మిత్రుడు అంతకన్నా కావు. నీవు నాకు శత్రువు. బద్ధ శత్రువును అయినా ఇంట్లో పెట్టుకోవచ్చు కానీ, బంధువు, మిత్రుడు అని చెప్పుకుంటూ నా నాశనము కోరేవాడిని ఇంట్లో ఉంచుకొనకూడదు. నీవు నాకు జ్ఞాతివి. జ్ఞాతులు ఎప్పుడూ సాటి జ్ఞాతుల మేలు కోరరు. అది లోకధర్మము. అదీ కాకుండా తన కన్నా ఉన్నతుడు, ఐశ్వర్యవంతుడు అయిన జ్ఞాతిని చూస్తే ఇతర జ్ఞాతులకు అసూయ, ద్వేషము, పగ. అలాగే నువ్వు కూడా నా
ఉన్నతిని నా సుఖమును చూచి ఓర్వలేకున్నావు. పైగా నాకు ఆపద వచ్చినప్పుడు సానుభూతి చూపకపోగా, ఆపదలలో ఉన్న నన్ను చూచి సంతోషిస్తున్నావు.
ఉన్నతిని నా సుఖమును చూచి ఓర్వలేకున్నావు. పైగా నాకు ఆపద వచ్చినప్పుడు సానుభూతి చూపకపోగా, ఆపదలలో ఉన్న నన్ను చూచి సంతోషిస్తున్నావు.
ఎవరికైనా గానీ అగ్నివలన, అస్త్ర, శస్త్రముల వలన పాశముల వలన కలుగు భయం కంటే క్రూరులైన జ్ఞాతుల వలన కలిగే ఆపదలు, భయాలు ఎక్కువ. కాబట్టి అన్ని భయముల కన్నా జ్ఞాతుల వలన భయం గొప్పది. ఆవులలో సంపద ఉంటుంది. స్త్రీలలో చంచలత్వవు ఉంటుంది. బ్రాహ్మణులలో తపస్సు ఉంటుంది. కానీ జ్ఞాతులలో సాటి జ్ఞాతుల ఎడల శత్రుత్వము ఉంటుంది. నీవు నాకు జ్ఞాతివి. నా గౌరవమును, పేరు ప్రతిష్టలను, నాకు ఉన్న ఐశ్వర్యమును, నా శత్రువులలో నన్ను గురించి ఉన్న భయమును చూచి నీవు ఓర్వలేకున్నావు. నీవు చెడ్డవాడివి. నీతో నాకు స్నేహము తగదు. చెడ్డవారితో స్నేహము అవశ్యము విడువతగినది.
ఓ విభిషణా! నీవు నా శత్రువును పొగుడుతూ ఎప్పుడెప్పుడు నా శత్రువుల వద్దకు పోవలెనా అని ఎదురుచూస్తున్నావు. కాబట్టి నీతో బంధుత్వము, స్నేహము ఎలాంటి ఫలితాన్ని ఇవ్వకపోగా నాకు చేటు తెస్తుంది. ఎంత చెడ్డా నువ్వు నా సోదరుడవు, బంధువు. అందుకని నీవు ఎన్ని మాటలు మాట్లాడినా క్షమించాను. అదే ఇంకొకరయితే ఈ పాటికి వాడి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయి ఉండేవి. నీవు రాక్షస కులములో చెడబుట్టావు." అని అత్యంత పరుషమైనమాటలతో విభీషణుని దూషించాడు రావణుడు.
రావణుని నోటినుండి అటువంటి మాటలు విన్న విభీషణుడు ఇంక అక్కడ ఒక్కక్షణం కూడా నిలువలేకపోయాడు. వెంటనే గదాయుధమును తీసుకొని ఆకాశంలోకి ఎగిరాడు. విభీషణునితోపాటు అతని మిత్రులు నలుగురు ఆకాశంలోకి ఎగిరారు. ఆకాశంలో నిలిచి విభీషణుడు రావణునితో ఇలా అన్నాడు.

“ఓ రాక్షసరాజా! నీవు నాకు సోదరుడవు. నాకన్నా పెద్దవాడవు. నీవు ఎన్ని అన్నా తప్పులేదు. నీవు నాకు తండ్రిస్థానములో ఉన్నావు. నీ మీద నాకు అపారమైన గౌరవము భక్తి ఉన్నాయి. ఎందుకంటే, తండ్రి, అన్న అధర్మపరులైనా వారు గౌరవనీయులు. కానీ నువ్వు నేను చెప్పిన హితములను పట్టించుకోకపోగా, నన్ను అత్యంత పరుషమైన పదజాలంతో దూషించావు. వాటిని నేను సహించలేను. నీ వద్ద ఉండలేను.
ఓ రావణా! ప్రస్తుతము నీ మనసు నీ అధీనములో లేదు. కామముతో నిండి పోయింది. కాలానికి లొంగిపోయింది. కాబట్టి నేను చెప్పిన మంచి మాటలు నీ చెవికి ఎక్కలేదు.
ఓ రాజా! నిన్ను పొగిడేవారు, నీకు ఇష్టమైన మాటలు మాట్లాడేవారు, నీ ప్రాపకము కోసం పాకులాడేవారు ఎంతో మంది ఉన్నారు. కాని, నీకు ఇష్టం లేకపోయినా, నీ మనసుకు కష్టమైనా, నీకు మంచి మాటలు చెప్పేవాళ్లు దొరకడం కష్టం. ఒకవేళ దొరికినా, వాళ్ల మాటలు నీవు వినవు. సర్వనాశనమునకు మూలమైన దారిలో నీవు నడుస్తున్నావు. అది చూచి నేను ఊరుకోలేకపోతున్నాను.
ఓ రావణా! నిన్ను రాముడు తన బాణములతో చంపుతూ ఉంటే నేను చూడలేను. ఎంత శూరుడైనా, పరాక్రమవంతుడైనా, అజేయుడైనా, కాలాను గుణంగా నశించక తప్పదు. నీకు ఆ గతి
పట్టకూడదని, నీకు అకాల మరణం రాకూడదనీ నా సంకల్పము. అందుకే ఇన్ని మాటలు చెప్పాను. కానీ నా మాటలు నీకు నచ్చవని నాకు తెలుసు. నా మాటలతో నీ మనసుకు కష్టం కలిగించి ఉంటే నన్ను క్షమించు. నిన్ను నీవు రక్షించుకో. ఈ లంకను, లంకలో ఉన్న రాక్షసులను రక్షించు. నేను వెళ్లిపోతున్నాను. నీవు శుభం కలుగు గాక!" అని పలికి విభీషణుడు ఆకాశమార్గాన తన అనుచరులతో వెళ్లిపోయాడు.

యుద్ధకాండము పదునారవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment