శ్రీమద్రామాయణం - సుందర కాండము - అరువదవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 60)

శ్రీమద్రామాయణము

సుందర కాండము

అరువదవ సర్గ

హనుమంతుని మాటలను సావధానంగా విన్న అంగదుడు ఇలా అన్నాడు. “హనుమంతుడు నూరుయోజనముల సముద్రమును దాటి లంకను చేరి సీతను చూచాడు. సీతను చూచి కూడా మనము సీతను మనతో తీసుకొని వెళ్లకుండా వట్టి చేతులతో పోవడం మంచిది కాదు. మనమంతా రాముని వద్దకు పోయి “రామా! మేము సీతను చూచాము కానీ ఆమెను అక్కడే వదిలి వచ్చాము" అని చెప్పపడం శోభస్కరము కాదని నా అభిప్రాయము. ముల్లోకములలో ఎక్కడి కైనా మనము ఎగిరిపోగల శక్తి మనకు ఉంది. ఇప్పటికే హనుమంతుడు చాలా మంది రాక్షస వీరులను సంహరించాడు. ఇంక మనము లంకకు వెళ్లి సీతను రావడమే మిగిలి ఉంది." అని పలికాడు అంగదుడు.

ఆ మాటలు విన్న జాంబవంతుడు వారితో ఇలా అన్నాడు.

"అంగదా! నీవు చెప్పిన మాటలు బాగుగా ఉన్నాయి. సీతను లంక నుండి తీసుకురావడం మన శక్తికి మించిన పనేం కాదు. కానీ ఇది రామ కార్యము. రాముడు మనలను కేవలం సీతను వెదకడానికి సీత జాడ తెలుసుకోడానికి పంపించాడు. మనం అంతవరకే చెయ్యాలి. ముందు మనం రాముని వద్దకు పోయి, సీత గురించి రామునికి వివరంగా చెబుదాము. రాముడు ఏమి చెబితే అలా చేద్దాము. రాముని ఆలోచన ఎలా ఉందో అలా చేద్దాము. అంతే కానీ మనం స్వతంత్రించి ఏమీ చేయవద్దు." అని అన్నాడు జాంబవంతుడు.

శ్రీమద్రామాయణము
సుందర కాండము అరువదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)