శ్రీమద్రామాయణం - సుందర కాండము - ఇరువది ఎనిమిదవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 28)
శ్రీమద్రామాయణము
సుందర కాండము
ఇరువది ఎనిమిదవ సర్గ
త్రిజటకు వచ్చిన స్వప్నము గురించి కానీ, దాని గురించి త్రిజట తోటి రాక్షస వనితలకు చెప్పడం కానీ సీతకు తెలియదు. రావణుడు వచ్చి తనను అన్న మాటలను తలచుకొని, తరువాత రాక్షస స్త్రీలు తనను చంపుతానని బెదిరిస్తూ మాట్లాడిన మాటలను తలచుకొని బాధపడుతూ ఉంది సీత.“నేను ఎంత పాపం చేసానో గానీ, వీళ్ల చేత ఇన్ని మాటలు పడుతూ కూడా నా ప్రాణములు నా శరీరమును వదలకుండా ఉన్నాయి. కాలము తీరనిది మరణము కూడా దగ్గరకు రాదు అన్న విషయం సత్యము అని తోస్తూ ఉంది. నేను సుఖాలకు నోచుకోలేదు. నా జీవితము అంతా దు:ఖ మయము. అయినా కూడా నా హృదయము పాషాణము కంటే గట్టిగా ఉంది. అందుకే జీవితాంతము కష్టములు వచ్చినా బద్దలు కాకుండా ఇంకా వజ్రసమానంగా ఉంది. అసలు నా తప్పు ఏమీ లేకుండానే రావణుడు నన్ను చంపమని ఆజ్ఞాపించాడు. ఈ రావణుడు ఏమి చేసినా వీడిని మాత్రము నేను దగ్గరకు రానివ్వను. ఈ రెండు నెలల గడువు లోపల రాముడు రాకుంటే ఈ రావణుడు నన్ను చంపుతాడు. రాముడు ఎప్పుడు వస్తాడో తెలియదు. నాకు ఎన్ని కష్టములు వచ్చి పడ్డాయి. రామా! లక్ష్మణా! తొందరగా రండి. నన్ను ఈ రాక్షసుని చెరనుండి నన్ను విడిపించండి.
ఆ రోజు కాలమే మృగరూపంలో వచ్చి నన్ను ప్రలోభ పెట్టింది. నేను రాముని ఆ మృగమును తెచ్చి ఇమ్మని అడిగాను. నా తెలివి తక్కువతనంతో లక్ష్మణుని కూడా దూరంగా పంపాను. అంతా కాలమహిమ. నా దురదృష్టము. రామలక్ష్మణులు తిరిగి వచ్చునప్పటికి నేను అపహరింపబడ్డాను. రామునికి, లక్ష్మణునికి నా గురించి ఎలా తెలుస్తుంది. నాగురించి తెలిసిన జటాయువు కూడా ఈ రాక్షసుని చేతిలో మరణించాడు. నేను చేసిన పూజలు, నోములు, వ్రతాలు, నా పాతివ్రత్యము, నేను అనుసరించిన ధర్మము అన్నీ వృధా అయిపోయాయి.
ఆ రోజు కాలమే మృగరూపంలో వచ్చి నన్ను ప్రలోభ పెట్టింది. నేను రాముని ఆ మృగమును తెచ్చి ఇమ్మని అడిగాను. నా తెలివి తక్కువతనంతో లక్ష్మణుని కూడా దూరంగా పంపాను. అంతా కాలమహిమ. నా దురదృష్టము. రామలక్ష్మణులు తిరిగి వచ్చునప్పటికి నేను అపహరింపబడ్డాను. రామునికి, లక్ష్మణునికి నా గురించి ఎలా తెలుస్తుంది. నాగురించి తెలిసిన జటాయువు కూడా ఈ రాక్షసుని చేతిలో మరణించాడు. నేను చేసిన పూజలు, నోములు, వ్రతాలు, నా పాతివ్రత్యము, నేను అనుసరించిన ధర్మము అన్నీ వృధా అయిపోయాయి.
కనీసము నా భర్తను చేరుకోడానికి కూడా పనికిరాని ఈ పాతివ్రత్యము ఎందుకు? నిరర్థకము కదా! రామా! నీవు నీ తండ్రి ఆజ్ఞ మేరకు పదునాలుగేండ్ల గడువు ముగిసిన తరువాత అయోధ్యకు పోయి, పట్టాభిషిక్తుడివై, కోరిన స్త్రీలతో సుఖించు. నేను ఇక్కడే ఈ రాక్షసుని చేతిలో మరణిస్తాను. నాకు నీ మీద ఉన్న ప్రేమ, నీకొరకు ఆచరించిన పాతివ్రత్యము నా వినాశము కొరకే దాపురించాయి. నా అంత దురదృష్టవంతురాలు లోకంలో ఉండబోదు. ఏం చెయ్యను. చచ్చిపోదామన్నా ఇంత విషం ఇచ్చే వాళ్లు కూడా లేరు. ఈ రాక్షసుని మందిరంలో విషానికి కూడా కరువే కదా!" అని పరి పరి విధముల విలపిస్తూ ఉంది సీత.
చావడానికి విషము కానీ, ఆయుధము కానీ లేకపోవడంతో, అందుబాటులో ఉన్న తన పొడుగాటి జడనే తాడుగా ఉపయోగించి, మెడకు ఉరివేసుకొని ప్రాణత్యాగము చేయడానికి ప్రయత్నించింది సీత.
“నేను ఈ జడతో ఉరి పోసుకొని, చచ్చిపోయి, యమలోకాని వెళతాను" అని మనసులో అనుకొంది సీత.
చావడానికి నిశ్చయించుకున్న సీత లేచి నిలబడింది. ఆ చెట్టు కొమ్మ కింద నిలుచుంది. చావడానికి సిద్ధంగా ఉన్న సీతకు శుభశకునములు కనపడ్డాయి. అటువంటి శకునములు కనపడినపుడు సీతకు ఎన్నో శుభాలు జరిగాయి. అటువంటి శుభ శకునములు మరలా కనపడ్డాయి సీతకు.
శ్రీమద్రామాయణము
సుందర కాండము ఇరువది ఎనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment