శ్రీమద్రామాయణం - సుందర కాండము - పంతొమ్మిదవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 19)
శ్రీమద్రామాయణము
సుందర దండము
పంతొమ్మిదవ సర్గ
తెల్లవారుజామున అట్టహాసంగా పరిజనులతో కూడా బయలు దేరిన రావణుడు సీత ఉన్న అశోక వనమునకు వచ్చాడు. ఆ సమయంలో వచ్చిన రాక్షస రాజు రావణుని చూచి సీత మనసు తల్లడిల్లిపోయింది. ఆమె లేత చిగురాకులా వణికిపోయింది. సీత తన అవయవములను దగ్గరగా చేర్చుకొని ముడుచుకొని కూర్చుంది.రాక్షస స్త్రీల మధ్య కూర్చుని ఉన్న సీతను చూచాడు రావణుడు. మనసులో రాముని తప్ప మరొకరిని తలంపని సీతను చూచాడు రావణుడు. సీత శరీరం లంకలో ఉన్నా మనసు మాత్రం రాముని వద్దనే ఉన్న సీతను చూచాడు రావణుడు. మంత్రతంత్రములతో కట్టబడిన మహాసర్పము వలె ఉన్న సీతను చూచాడు రావణుడు. నివురు గప్పిన నిప్పులా శోకముతో కప్పబడిన అగ్నిజ్వాల లాంటి సీతను చూచాడు రావణుడు. రాముని కోసరం పరితపిస్తూ, కేశసంస్కారములేక, మాసిన బట్టలతో కూర్చుని ఉన్న సీతను చూచాడు రావణుడు. నిత్య ఉపవాసములతోనూ, రాముని గురించిన ఆలోచనలతోనూ, రావణుని వలన భయంతోనూ, మనసులో కేవలము రాముని ధ్యానిస్తూ కృశించిన శరీరంతో ఉన్న సీతను చూచాడు రావణుడు. తన మనసులో, రాముడు ఎప్పుడు వచ్చి రావణుని చంపుతాడా, తనను రావణ చెరనుండి విడిపిస్తాడా, అని నిరంతరము కోరుకుంటున్న సీతను చూచాడు రావణుడు.
ఆ సమయంలో వచ్చిన రావణుని చూచి సీత విలపిస్తూ ఉంది.
శ్రీమద్రామాయణము
సుందర కాండము పంతొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment