శ్రీమద్రామాయణం - సుందర కాండము - ఎనిమిదవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 8)
శ్రీమద్రామాయణము
సుందర కాండము
ఎనిమిదవ సర్గ
హనుమంతుడు పట్టిన పట్టు వదలకుండా, ఒక పక్క ఆ పుష్పక విమానములోని వింతలు విశేషాలు చూస్తూనే విమానం అంతా క్షుణ్ణంగా వెదుకుతున్నాడు. ఆ విమానములో అన్ని వస్తువులు, నిర్మాణములు వేటికవే సాటి గా ఉన్నాయి. విశేషం కానిది ఏదీ లేదు. అన్నీ గొప్పగా ఉన్నాయి. ఆ విమానంలో మరొక విశేషం ఏమిటంటే ఆ విమానంలో కూర్చున్న వాళ్లు ఎటు వెళ్లాలని మనసులో అనుకుంటే ఆ విమానం అలా వెళుతుంది. ఆ విమానము యొక్క నిర్మాణము అత్యంత విశిష్టంగా ఉంది.ఆ విమానము ఒక భవనము ఆకారంలో, పెద్ద పెద్ద శిఖరములతో నిర్మింపబడి ఉంది. ఆ విమానమును భయంకరాకారులు అయిన రాక్షసులు రక్షిస్తున్నారు.
శ్రీమద్రామాయణము
సుందర కాండము ఎనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment