శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - అరువది రెండవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 62)
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము
అరువది రెండవ సర్గ
నేను ఆ ఋషితో నా విషయం గురించి చెప్పి దు:ఖిస్తున్నాను. అప్పుడు ఆ ఋషి కొంచెం ఆలోచించి ఇలా అన్నాడు. “నీకు కాలక్రమేణా రెక్కలు, బుద్ధి, జ్ఞానము అన్నీ వస్తాయి. అధైర్యపడకు. దానికి ముందు నేను చెప్పేది విను. నేను ఈ విషయాలన్నీ నా దివ్యదృష్టితో గ్రహించాను. ఇక్ష్వాకు వంశంలో దశరథుడు అనే మహారాజు పుడతాడు. ఆయనకు నలుగురు కుమారులు కలుగుతారు. అందులో రాముడు పెద్దవాడు. తండ్రి అయిన దశరథుని ఆదేశము మేరకు రాముడు, తన భార్య సీత, తమ్ముడు లక్ష్మణునితో కలిసి అరణ్యములకు వెళతాడు. అప్పుడు కొన్ని కారణముల వలన రావణుడు అనే రాక్షస రాజు రాముని భార్యను జన స్థానము నుండి అపహరిస్తాడు. సీత రావణుని సంపదలకు భోగములకు విలాసములకు లొంగదు. ఈ విషయాన్ని తెలుసుకొన్న దేవేంద్రుడు అమృతముతో సమానమయిన పరమాన్నమును సీతకు ఇస్తాడు. ఆ పరమాన్నమును దేవేంద్రుడు ఇచ్చాడు అని తెలుసుకొన్న సీత, ఆ పరమాన్నములో కొంత భాగమును తీసి నేల మీద పెట్టి "ఇది నా భర్తరామునికి, నా మరిది లక్ష్మణునకు, వారు జీవించి భూమి మీద ఉన్నా, చచ్చి స్వర్గాన ఉన్నా, వారికి చెందుతుంది." అని పలుకుతుంది.తరువాతి కాలంలో సీతను వెతుకుతూ రాముడు పంపగా వచ్చిన వానరులు నిన్ను కలుస్తారు. వారికి నీవు సీత గురించి చెప్పాలి. అందుకని నీవు ఇక్కడే ఉండి వారి రాక కోసరము నిరీక్షిస్తూ ఉండాలి. నేను నా తపోబలముతో నీకు ఇప్పుడే రెక్కలు తెప్పించగలను. కానీ నీకు రెక్కలు వస్తే నీవు ఇప్పుడే ఎగిరిపోతావు. నీవు ఇక్కడ వానరుల కోసరం వేచి ఉండటం అవసరము. ఎందుకంటే రామ దూతలకు సాయం చెయ్యడం లోకోపకారము చెయ్యడం వంటిది. నాకు కూడా అప్పటి దాకా బతికి ఉండి రాముని లక్ష్మణుని చూడవలెనని కోరికగా ఉంది. కానీ శరీరం సహకరించదు కదా! అందుకని ఈ శరీరాన్ని వదిలిపెడుతున్నాను.” అని ఆ ఋషి నాతో సీతను గురించి చెప్పాడు.
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము అరువది రెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment