శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - నలుబది ఐదవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 45)
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము
నలుబది ఐదవ సర్గ
సీతను వెదకడానికి నాలుగు దిక్కులకు ప్రయాణమైన వానర సేనలు ఉత్సాహంతో బయలుదేరుతున్నాయి. ఎవరికి వారు తామే సీత జాడ కనుక్కోగలము అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. శతబలుడు తన సేనలతో ఉత్తర దిక్కుగా బయలుదేరాడు. వినతుడు తూర్పు దిక్కుగా వెళ్లాడు. హనుమంతుడు, తారుడు, అంగదునితో కలిసి దక్షిణ దిక్కుగా వెళ్లాడు. సుషేణుడు పశ్చిమ దిక్కుగా వెళ్లాడు. అందరూ అన్ని దిక్కులకు ప్రయాణమయ్యారు.వానరులంతా తమ సహజసిద్ధమైన చపలత్వంతో అరుచుచూ, కేకలు పెట్టుచూ, ఎగురుతూ వెళుతున్నారు. వారంతా “ఆ దుర్మార్గుడు రావణుని చంపి సీతను తీసుకొని వస్తాము” అని
శపధాలు చేస్తూ వెళుతున్నారు.
మరికొందరైతే “ఆ రావణుని చంపడానికి ఇంత మంది కావాలా! నేను ఒక్కడినే రావణుని చంపుతాను. రాక్షసులందరినీ చంపుతాను, సీతను తీసుకొని వస్తాను" అని ప్రగల్భాలు పలుకుతున్నాడు.
మరి కొందరు “మీరంతా ఇక్కడే ఉండండి. నేను ఒక్కడినే వెళ్లి సీత పాతాళంలో ఉన్నా సరే తీసుకొని వస్తాను.” అని జబ్బలు చరుస్తున్నాడు.
మరి కొందరు “నేను పెద్ద పెద్ద చెట్లనే పెకలిస్తాను. కొమ్మలు విరుస్తాను. పర్వతాలను నుగ్గునుగ్గు చేస్తాను. సముద్రాలను ఇంకింపచేస్తాను." అని మీసాలు మెలేస్తున్నారు.
ఇంకా ఒక్కొక్కళ్లు తమ బలా బలాల గురించి చెప్పుకుంటున్నారు. ఒకడు “నేను నూరు యోజనముల దూరం ఎగరగలను" అని అంటే మరొకడు నేను ఇంకా ఎక్కువ దూరము ఎగురగలను అని గంతులేస్తున్నాడు. మరొకడైతే “ఈ ముల్లోకాలలో నాకు అడ్డులేదు. రానీ
ఎవడొస్తాడో చూస్తాను" అని తన వీరత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. బలగర్వితులైన వానరులు ఇలా తమ బలా బలముల గురించి ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు.
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము నలుబది ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment