శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - నలుబది ఒకటవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 41)
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము
నలుబది ఒకటవ సర్గ
రావణుడు చెప్పిన పని చేస్తే రాముడు చంపుతాడు. తను చెప్పిన పని చెయ్యకపోతే రావణుడు చంపుతాడు. ఎవరో ఒకరి చేతిలో తనకు చావు తప్పదు. అందుకని మరలా ఒకసారి రావణునికి చెప్పి చూస్తే మంచిదేమో అనుకున్నాడు మారీచుడు. అయితే ఈ సారి స్వరం మార్చి కొంచెం కటువుగా మాట్లాడాడు.“ఓ రావణా! నీవు సకుటుంబంగా నశించే ఈ మార్గాన్ని ఎవరు చెప్పారు? వాళ్లు చెప్పినా నీవు ఎలా విన్నావు? నాకు తెలుసు. నీవు సుఖంగా ఉండటం చూచి ఓర్వలేక నీకు గిట్టని వాళ్లు నీకు ఈ దురూపదేశం చేసి ఉంటారు. ఇంతకూ వారు ఎవరో నాకు తెలియాలి. నీ చావు చూడాలని కోరుకొనే నీ శత్రువులు ఎవరో నాకు తెలియాలి.
రాముని శత్రువులు ఎవరో కానీ వాళ్లు రాముని చంపలేక, మహా పరాక్రమ వంతుడైన నీ చేత చంపించాలని చూస్తున్నారు. వారి మాయమాటలకు లోబడి నీవు రామునితో వైరం పెట్టుకుంటున్నావు. నీ సర్వనాశనాన్ని కొని తెచ్చుకుంటున్నావు. వాళ్లు ఎవరో నాకు చెప్పు. వాళ్లు నీ మంత్రులే అయితే వారిని వెంటనే చంపెయ్యి.
నీవు దారి తప్పి నడిచినా, నిన్ను సక్రమ మార్గంలో పెట్టే వాళ్లే నీ మంత్రులు కానీ నీ చావును కోరే వారు నీకు మంత్రులు, హితులు ఎలా అవుతారు? రాజు చెడ్డ మార్గంలో పోతుంటే, మంత్రులు రాజుకు హితం చెప్పి, మంచి మార్గంలో నడిచేట్టు చెయ్యాలి. అటువంటి మంత్రులు నీ వద్ద లేరనుకుంటాను!
రాజు మంచి వాడైతే మంత్రులకు కూడా మంచి పేరు వస్తుంది. రాజు చెడ్డ వాడైతే మంత్రులు రాజును సరిదిద్దాలి లేకపోతే ప్రజలకు నష్టం జరుగుతుంది. రాజ్యానికి మూలం రాజు. అటువంటి రాజును మంచి మార్గంలో నడిపించి, రాజును రక్షించుకోవడం మంత్రులవిధి. ప్రజావ్యతిరేకుడైన రాజు, ప్రజలను పీడించేరాజు ప్రజాభిమానము చూరగొనలేడు. అటువంటి రాజుకు రాజ్యమును పాలించే అర్హత లేదు. రాజు మంచి వాడైనా, మంత్రులు చెడ్డ వారైతే, మంత్రుల చెడు సలహాల ఫలితంగా, రాజు కూడా వారితో పాటు నశించి పోతాడు. ప్రజాక్షేమాన్ని మరిచిన రాజు పాలనలో ప్రజలు అష్టకష్టాల పాలవుతారు. ఇప్పుడు నీవు తీసుకునే ఈ నిర్ణయంతో నీతోపాటు అమాయకులైన నీ ప్రజలు కూడా నశించిపోతారు.

ఓ రావణా! నాకు ఎటూ చావు తప్పదు. అది నాకు తెలుసు. నా బాధ అంతా నీ గురించే. పోతే నేను ఒక్కడినే పోతాను. కానీ నీవు, నీ ప్రజలు, సైన్యంతో సహా నశించిపోతావు. నీవు చెప్పిన పని నేను చేస్తాను. రాముడి చేతిలో చస్తాను. కాని నేను చచ్చిన కొద్ది కాలంలో నువ్వు కూడా నా మార్గాన్నే అనుసరిస్తావు. నీవు నాకు ఇస్తానన్న రాజ్యాన్ని ఆశించి నేను ఈ పని చేయడం లేదు. రాముని చూడగానే నాకు చావు తప్పదు అని నాకు తెలుసు. కాని సీతను అపహరించిన తరువాత, లంకను పాలించ డానికి నీవు ఉండవు అని తెలుసుకో!
కాబట్టి ఓ రావణా! ఇదే మన ఆఖరు సమావేశము. నేను నీతో వచ్చి రాముని దూరంగా తీసుకొని వెళ్లగానే నేను చస్తాను. సీతను అపహరించగానే నీవు చస్తావు. అప్పుడు ఈ లంకా ఉండదు. ఈ రాక్షసులూ ఉండరు. నేను ఏమి చెప్పినా నీవు వినవు అని నాకు తెలుసు. కానీ చెప్పడం నా ధర్మం కనుక చెప్పాను. తరువాత నీ ఇష్టం. ఇంక పోదాం పద.” అని అన్నాడు మారీచుడు.
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము నలుబది ఒకటవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment