శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ముప్పదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 30)
శ్రీమద్రామాయణము
అరణ్య కాండము
ముప్పదవ సర్గ
రాముడు ఖరుని గదను తుత్తునియలు చేయగానే ఖరుడు నివ్వెరపోయాడు. రాముడు ఖరుడు అప్పటిదాకా మాట్లాడిన మాటలకు ప్రత్యుత్తరము ఇచ్చాడు.“ఓ రాక్షసాధమా! నీ బలం ఎంతో తేలిపోయింది కదా! వృధాగా అరుస్తావు ఎందుకు. ఏ గదాఘాతముతో నన్ను చంపుదామనుకున్నావో ఆ గద నా బాణఘాతముతో విరిగి ముక్కలై నేలమీద పడిపోయింది. మరి ఇప్పుడు నీవు పోయి మరణించిన నీ సైనికుల బంధుమిత్రుల కన్నీళ్లు ఎలా తుడుస్తావు. నీ మాటలు వమ్ముఅయినట్లే కదా! దుష్టుడు, దుర్మార్గుడు అయిన నిన్ను చంపడానికి నాకు కారణం ఉంది. నీవు చంపదగ్గవాడవు. అందుకే నిన్ను చంపుతున్నాను.
నీ కంఠమును తెగనరుకుతాను. నీ నెత్తురుతో భూమాతను తడుపుతాను. నీకు భూపతనము తప్పదు. నిన్ను చంపి ఈ దండకారణ్యమును శత్రుపీడ, రాక్షస పీడ లేకుండా చేస్తాను.
ఇప్పటి దాకా ఈ దండకారణ్యములో నిత్యము బ్రాహ్మణులను, మునులను నీవు నీ పరివారము బాధిస్తున్నారు, చంపుతున్నారు. ఈ రోజు నుంచి ఈ దండకారణ్యములో ఋషులు, మునులు, బ్రాహ్మణులు నిర్భయంగా తపస్సు చేసుకొనేలా చేస్తాను. ఎంతోమంది ఋషులకు, మునులకు ఈ దండకారణ్యము ఆశ్రయము కాగలదు. ఇప్పటి దాకా ఋషులను, మునులను భయపెడుతూ, వారి యజ్ఞయాగములను నాశనం చేస్తూ, వారిని చంపుతున్న రాక్షస స్త్రీలు ఇంక ఈ దండకారణ్యము విడిచిపోకతప్పదు. నీ భార్యలందరూ నీ శవం మీద పడి ఏడ్చేరోజు వచ్చింది." అని నిర్భయంగా మాట్లాడుతున్న రాముని చూచి ఖరుడు రాముడి బెదిరించడానికి పూనుకున్నాడు.

“ఓ రామా! నీవు అవివేకివే అనుకున్నాను. గర్విష్ఠివి కూడా. నీకు మహా గర్వము ఉంది. అవసాన దశలో మానవులకు ఇలాంటి గర్వమే ఉంటుంది. చచ్చేముందు సంధివ్రేలాపన లాగా నీవు కూడా ఏదేదో మాట్లాడుతున్నావు.” అంటూ ఖరుడు తగిన ఆయుధము కొరకు చుట్టూ చూచాడు. దగ్గరలోనే ఉన్న ఒక సాలవృక్షమును కూకటి వేళ్లతో పెకలించాడు. దానిని ఆయుధంగా ధరించి, “రామా! ఈ దెబ్బతో నువ్వు చచ్చావురా!” అంటూ ఆ చెట్టును బలంగా రాముని మీదికి
విసిరాడు.
విసిరాడు.
రాముడు తన మీదికి అత్యంత వేగంతో దూసుకువస్తున్న సాలవృక్షమును తన వాడి అయిన బాణములతో రెండుగా ఖండించాడు. వెంటనే రాముడు వేయి బాణములను ఒకదాని వెంట ఒకటిగా సంధించి ఖరుని శరీరం అంతా తూట్లు పడేట్టు కొట్టాడు. ఖరుని శరీరం నుండి రక్తం జలపాతంలాగా బయటకు ఉరికింది. తన శరీరం అంతా నెత్తురు కారుతుండగా ఖరుడు రాముని మీదికి పరుగెత్తాడు. రాముడు ఆగ్నేయాస్త్రమును సంధించాడు. ఖరుని గుండెలకు గురిపెట్టి కొట్టాడు. ఆ అస్త్రము ఖరుని గుండెలను చీల్చింది. ఖరుడు మొదలు నరికిన చెట్టులాగా కిందపడ్డాడు. ఖరుని ప్రాణవాయువులు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. దండకారణ్యమునకు శాశ్వతంగా రాక్షస పీడ విరగడ అయింది
ఆ దృశ్యమును చూచిన దేవతలు, గంధర్వులు, సిద్ధులు, చారణులు రాముని ఎంతో ప్రశంసించారు. అప్పుడు దేవతలు అసలు విషయాన్ని తమలో తాము చెప్పుకున్నారు.
“దేవేంద్రుడు శరభంగాశ్రమమునకు ఇందుకే వెళ్లాడట. ఈ ఖరుని దూషణుని సంహరించడానికే ఆ మునులు రాముని ఈ ప్రాంతమునకు తీసుకొని వచ్చారట. ఇంక దండకారణ్యములో ఋషులు, మునులు, బ్రాహ్మణులు సుఖంగా జీవించగలరు." అని అనుకొన్నారు. అంతట దేవతలు దేవ దుందుభులు మ్రోగించారు. రాముని మీద పుష్పవర్షము కురిపించారు.

రాముడికి, ఖరునికి, దూషణునికి, 14,000 మంది రాక్షసులకు జరిగిన యుద్ధము దాదాపు ఒకటిన్నర ముహూర్తకాలము జరిగింది. (ముహూర్తము అనగా 48 నిమిషములు. అనగా ఒక గంటా
పన్నెండు నిమిషముల పాటు జరిగింది.) రాముని వీర్యమును పరాక్రమమును యుద్ధకౌశలమును తలుచుకుంటూ దేవతలు తమ తమ నివాసములకు వెళ్లారు.
పన్నెండు నిమిషముల పాటు జరిగింది.) రాముని వీర్యమును పరాక్రమమును యుద్ధకౌశలమును తలుచుకుంటూ దేవతలు తమ తమ నివాసములకు వెళ్లారు.
రామునికి రాక్షసులకు మధ్య యుద్ధము ముగిసింది అని తెలుసుకొన్న లక్ష్మణుడు సీతతో సహా గుహ నుండి వెలుపలికి వచ్చాడు. రాముని తో వచ్చిన మునులు ఋషులు రాముని అభినందిస్తూ ఉండగా రాముడు సీతా సమేతంగా పర్ణశాలలో ప్రవేశించాడు.
పర్ణశాలలోకి రాగానే సీత తన భర్త రాముని అభినందన పూర్వకంగా కౌగలించుకుంది. తరువాత సీతారాములు బయటకు వచ్చారు. యుద్ధములో చనిపోయిన రాక్షసులను చూచింది సీత.
రామునికి ఏ అపాయము కలగనందుకు ఎంతో ఆనందపడింది.
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ముప్పదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment