శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - పదునెనిమిదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 18)
శ్రీమద్రామాయణము
అరణ్య కాండము
పదునెనిమిదవ సర్గ
కామంతో కాలిపోతున్న శూర్పణఖను చూచాడు. రాముడు. చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నాడు. “ఓ సుందరీ! నీవు నన్ను పెళ్లిచేసుకుంటాను అన్నావు. కాని నాకు ఇదివరకే పెళ్లి అయింది. ఈమే నాభార్య. ఈమె అంటే నాకు ప్రాణము. నీవు మళ్లీ నన్ను పెళ్లిచేసుకుంటే నీకు సవతి పోరు తప్పదు. నాతో కోరికలు తీర్చుకోవాలి అని గాఢంగా కోరుకున్న నీకు సవతి పోరు ఉండటం నీవు సహించగలవా! నీవంటి కాముకులు సవతి పోరు అస్సలు సహించలేరు. అడుగో అక్కడ నిలబడి ఉన్నాడు. ఆయన నా తమ్ముడు లక్ష్మణుడు. మంచి అందగాడు. పాపం అతనికి భార్యాసౌఖ్యము లేదు. ప్రస్తుతము అతనికి భార్య అవసరము ఉంది. కాబట్టి అతడు నీకు తగిన భర్త. పైగా నీవు అతనిని పెళ్లిచేసుకుంటే నీకు సవతి బాధ ఉండదు. కాబట్టి నన్ను విడిచిపెట్టి అతని వద్దకు పో!" అని అన్నాడు రాముడు.
ఇద్దరూ అందగాళ్లే. ఎవరైనా ఒకటే అనుకుంటూ శూర్పణఖ లక్ష్మణుని వద్దకు వెళ్లింది. శూర్పణఖ మొదట రాముని వద్దకు పోవడం, ఆయనతో మాట్లాడటం, తరువాత తన వద్దకు రావడం చూస్తున్నాడు లక్ష్మణుడు. శూర్పణఖ చకా చకా లక్ష్మణుని వద్దకు వెళ్లింది.
“ఓ సుందరాకారా! నా పేరు శూర్పణఖ. నన్ను వివాహం చేసుకుంటే నీకు అమర సుఖాలు అందిస్తాను. ఈ వనసీమలలో మనం హాయిగా విహరిద్దాము. రా! నాతోరా!" అని తొందరపెట్టింది శూర్పణఖ.
లక్ష్మణుడు ఆమెను చూచి ఇలా అన్నాడు. “ఓ లలనా! నేను నా అన్న రామునికి సేవకుడను. నా అన్నకు వదినకు దాసుడను. నేనే వారికి సేవలు చేస్తుంటే, నువ్వు కూడా నన్ను పెళ్లిచేసుకొని వారికి సేవలుచేస్తావా! ఎవరైనా రాణి కావాలని కోరుకుంటారు కానీ సేవకురాలు కావాలని కోరుకుంటారా చెప్పు. కాబట్టి నేను నీకు తగినవాడను కాను. నీవు రాముని వద్దకు వెళ్లు. ఆయనకు
చిన్నభార్యగా ఉన్నా, ఆనందం అనుభవిస్తావు. అప్పుడు నేనే నీకు సేవలు చేస్తాను. రాముని భార్యను చూడు. ఎంత అందవికారంగా ఉందో! పైగా ముసలిది. పొట్టలోపలికి పోయి ఎంత వికృతంగా ఉందో చూడు! ఇంకొక్కసారి అడిగావనుకో రాముడు తన అందవికారి అయిన భార్యను విడిచి నిన్నే పెళ్లాడతాడు. రామునితో అమర సుఖాలు అనుభవించు. అయినా లోకోత్తర సుందరి అయిన నిన్ను వదిలి బుద్ధి ఉన్నవాడు ఎవరైనా ఆ మనుష్యకాంతను కోరుకుంటారా చెప్పు! కాబట్టి వెంటనే రాముని వద్దకు వెళ్లు. నీ మంచికోరి చెబుతున్నాను. విను.” అని బంతిని తిరిగి రాముని వద్దకు నెట్టాడు.
చిన్నభార్యగా ఉన్నా, ఆనందం అనుభవిస్తావు. అప్పుడు నేనే నీకు సేవలు చేస్తాను. రాముని భార్యను చూడు. ఎంత అందవికారంగా ఉందో! పైగా ముసలిది. పొట్టలోపలికి పోయి ఎంత వికృతంగా ఉందో చూడు! ఇంకొక్కసారి అడిగావనుకో రాముడు తన అందవికారి అయిన భార్యను విడిచి నిన్నే పెళ్లాడతాడు. రామునితో అమర సుఖాలు అనుభవించు. అయినా లోకోత్తర సుందరి అయిన నిన్ను వదిలి బుద్ధి ఉన్నవాడు ఎవరైనా ఆ మనుష్యకాంతను కోరుకుంటారా చెప్పు! కాబట్టి వెంటనే రాముని వద్దకు వెళ్లు. నీ మంచికోరి చెబుతున్నాను. విను.” అని బంతిని తిరిగి రాముని వద్దకు నెట్టాడు.
లక్ష్మణుడు తనను ఆట పట్టిస్తున్నాడు అని దాని మట్టి బుర్రకు తోచలేదు. ఇదేదో బాగానే ఉందనుకొని, శూర్పణఖ తిరిగి రాముని వద్దకు పోయింది.
“రామా! నన్ను చూడు. నీ భార్యను చూడు. నేను లోకోత్తర సౌందర్యవతిని. నీ భార్య కురూపి. పైగా ముసలిది. దానితో ఏం సుఖపడతావు. నాతో రా. నన్ను పెళ్లిచేసుకో. నీకు అమరసుఖాలు రుచి చూపిస్తాను. (సీతను చూపిస్తూ) ఈ అందవికారిని చూచా నన్ను వద్దంటున్నావు. ఇది ఉండబట్టి కదా నువ్వు నన్ను కాదంటున్నావు. చూస్తూ ఉండు. ఇప్పుడే దీనిని కరా కరా నమిలి తింటాను. అప్పుడు నాకు సవతి పోరు ఉండదుగా! రా రామా! మనం హాయిగా పెళ్లిచేసుకొని సుఖిద్దాము." అని రాముని బలవంతం చేసింది శూర్పణఖ. సీతను చంపడానికి ఆమె మీదికి వెళ్లింది. వెంటనే
రాముడు శూర్పణఖను అడ్డుకున్నాడు. పక్కకు నెట్టాడు. లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు.
“లక్ష్మణా! ఇలాంటి దుష్టులతోనా నీ పరిహాసాలు. ఇప్పుడు చూడు ప్రమాదం త్రుటిలో తప్పిపోయింది. లేకపోతే ఈ దుష్టురాలు సీతను చంపి ఉండేది. సీత చూడు భయంతో ఎలా వణికిపోతూ ఉందో! లక్ష్మణా! దీనికి దీని అందం చూచుకొని గర్వం. ఆ గర్వం పోగొట్టు. దీనిని అంగవిహీనురాలిగా, అందవిహీనురాలిని చెయ్యి. లేకపోతే ఇది సీతను చంపుతుంది." అని అన్నాడు రాముడు.
అప్పుడు లక్ష్మణుడు కత్తి తీసుకొని శూర్పణఖ ముక్కు చెవులు కోసి అంగవిహీనురాలిని, అందవిహీనురాలిని చేసాడు లక్ష్మణుడు. హటాత్తుగా జరిగిన ఈ పరిణామానికి తట్టుకోలేకపోయింది శూర్పణఖ. పైగా తెగి పడిన ముక్కు, చెవుల నుండి రక్తం ధారాపాతంగా కారుతూ ఉంది. వెంటనే రాముని వదిలి అడవిలోకి పారిపోయింది.
ఆ ప్రకారంగా ముక్కునుండి చెవుల నుండి రక్తం కారుతుంటే శూర్పణఖ పరుగెత్తిపోయింది. జన స్థానములో తన చుట్టు రాక్షస సేనలు ఉండగా, శూర్పణఖ అన్న ఖరుడు కూర్చొని ఉన్నాడు. శూర్పణఖ సరాసరి తన అన్న ఖరుని వద్దకు వెళ్లింది. ఏడుస్తూ నేలమీద పడిపోయింది.
తన చెల్లి అలా పడిపోవడం చూచి సహించలేక పోయాడు ఖరుడు. ఆమె వద్దకు వచ్చి ఆమెను లేవనెత్తాడు. ఆమె చెవుల నుండి, ముక్కునుండి రక్తం కారడం చూచాడు. ఏం జరిగింది అని అడిగాడు.
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము పదునెనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment