శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - తొంభయ్యి ఐదవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 95)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
తొంభయ్యి ఐదవ సర్గ
రాముడు సీతతో కలిసి మందాకినీ నదీ తీరంలో విహరిస్తున్నాడు."సీతా! ఈ మందాకినీ నదీతీరము చూడు. ఎంత సుందరముగా ఉన్నదో! ఆఇసుక తిన్నెలు, నదీజలములలో ఈదుచున్న హంసలు, పైన ఎగురుచున్న సారస పక్షులు, జలముల మీద తేలుచున్న పద్మములు ఎంత శోభాయమానముగా ఉన్నవో చూడు! అదుగో ఆ లేళ్ల గుంపులు నదీజలములు తాగుటకు ఎలా వస్తున్నాయోచూడు! ఆవల తీరమున ఋషులు మందాకినీ నదిలో స్నానం చేస్తున్నారు. మరికొందరు సూర్యోపాసన చేస్తున్నారు. సీతా! ఆ చక్రవాక పక్షులు ఎంత మధురంగా కూయుచున్నవో.
ఇంతటి మనోహరముగా ఉన్న ఈ నదీప్రాంతమును విడిచి వెళ్లుటకు మనసు రాకున్నది. అయోధ్య కన్నా ఇక్కడే బాగుంది కదూ! సీతా నీవు కూడా ఈ నదిలో దిగి జలక్రీడలు ఆడుతావా! ఈ చిత్రకూట పర్వతమే అయోధ్య అనుకో. ఈ మందాకినీ నది సరయూనది. హాయిగా నదిలో దిగి జలకాలాడు. నీవు, లక్ష్మణుడు, తోడుగా ఉండగా ఇంతటిసుందర ప్రదేశములలో విహరిస్తూ నేను అయోధ్యనే మరిచిపోతున్నాను. ప్రస్తుతము నాకు అయోధ్య మీద కాని, ఆ రాజ్యము మీద కానీ ఆసక్తి లేదు.ఇక్కడే ఉండాలని ఉంది." అని అన్నాడు రాముడు.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము తొంభయ్యి ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment