శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నూరవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 100)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
నూరవ సర్గ
భరతుడు మరలా రాముని పాదాల మీదకు జారిపోయాడు. రాముని పాదాలు తన కన్నీటితో కడుగుతున్నాడు. రాముడు వాత్సల్యముతో భరతుని రెండు చేతులతో పైకి లేవనెత్తాడు. తన తొడమీద కూర్చోపెట్టుకున్నాడు. భరతుని కళ్లు తుడిచాడు. శిరస్సు ముద్దుపెట్టుకున్నాడు."భరతా! నీవు ఒంటరిగా ఈ అరణ్యములకు ఎందుకు వచ్చావు? తండ్రిగారు దశరథమహారాజుగారు రాలేదా! ఆయన ఎక్కడికి వెళ్లారు? నీవు ఒంటరిగా ఎందుకు వచ్చావు? ఎందుకంటే తండ్రిగారు జీవించి ఉండగా నా కొరకు అరణ్యములకు రావలసిన అవసరము నీకు లేదు కదా! మన వివాహముల తరువాత నీవు నీ మాతామహుల ఇంటికి వెళ్లావు. మరలా ఇన్నాళ్లకు నిన్ను చూడగలిగాను. నాకు చాలాసంతోషంగా ఉంది.
కాని నీవు అరణ్యములకు రావలసిన అవసరమేమి ఉన్నదో నాకు తెలియడం లేదు? తండ్రి గారు క్షేమముగా ఉన్నారా! నేను అడవుల పాలు అయ్యాను అన్న దుఃఖంతో స్వర్గస్థులు కాలేదు కదా! లేకపోతే నీవు చిన్నవాడవు, రాజ్యము చేయుటకు అర్హుడవు కావు అని నీ తండ్రిగారు నీకు రాజ్యము ఇచ్చుటకు నిరాకరించలేదు కదా!
ఏకారణము చేత నీవు ఇక్కడకు వచ్చావో తెలియజెయ్యి.
భరతా! నేను అనవసరంగా ఏదేదో ఊహించు కుంటున్నాను. తండ్రిగారు క్షేమంగా ఉన్నారని అనుకుంటున్నాను. నీవు ఆయనకు ప్రతిరోజూ సేవలు చేస్తున్నావు కదా! నాకే ఆ భాగ్యము లేదు.
మన పురోహితుల వారు వసిష్ఠుల వారు క్షేమంగా ఉన్నారా. నీవు ప్రతిరోజూ ఆయనను పూజిస్తున్నావు కదా! నా తల్లులు కౌసల్య, సుమిత్ర కైకేయి క్షేమంగా ఉన్నారు కదా! మన పురోహితులు, వారి కుమారుడు నీకు సర్వవేళలా అండగా ఉంటూ నీచేత అగ్ని కార్యములు, హెూమములు చేయిస్తున్నారు కదా! నీకు ధర్మాధర్మములను బోధిస్తున్నారు కదా!
నీవు దేవతలను, పితరులను, తల్లి తండ్రులను, గురువులను ప్రతిరోజూ పూజిస్తున్నావు కదా! బ్రాహ్మణులను, వృద్ధులను ఆదరిస్తున్నావు కదా! మనకు అస్త్రవిద్య చెప్పిన గురువు సుధన్వుని తగురీతిలో సత్కరిస్తున్నావు కదా!
మన పురోహితుల వారు వసిష్ఠుల వారు క్షేమంగా ఉన్నారా. నీవు ప్రతిరోజూ ఆయనను పూజిస్తున్నావు కదా! నా తల్లులు కౌసల్య, సుమిత్ర కైకేయి క్షేమంగా ఉన్నారు కదా! మన పురోహితులు, వారి కుమారుడు నీకు సర్వవేళలా అండగా ఉంటూ నీచేత అగ్ని కార్యములు, హెూమములు చేయిస్తున్నారు కదా! నీకు ధర్మాధర్మములను బోధిస్తున్నారు కదా!
నీవు దేవతలను, పితరులను, తల్లి తండ్రులను, గురువులను ప్రతిరోజూ పూజిస్తున్నావు కదా! బ్రాహ్మణులను, వృద్ధులను ఆదరిస్తున్నావు కదా! మనకు అస్త్రవిద్య చెప్పిన గురువు సుధన్వుని తగురీతిలో సత్కరిస్తున్నావు కదా!
నీవు రాజ్యాభిషిక్తుడవు అయిన తరువాత నీతిమంతులు, బుద్ధిమంతులు, విద్యావంతులు, రాజనీతి విశారదులనే మంత్రులుగా నియమించావు కదా! ఎందుకంటే, మంత్రులు రాజనీతికోవిదులు, రాజుయొక్క రహస్యములను కాపాడకలిగిన వారు అయిఉండడం ఎంతో ముఖ్యం.
భరతా! నీ పాలన ఎలా ఉంది! జాగరూకతతో ఉంటున్నావా లేక సమయం కాని సమయాలలో నిద్రపోతున్నావా! రాజుకు నిద్ర చేటు తెస్తుంది. సదా జాగరూకుడవై ఉండాలి. నీవు ఎల్లప్పుడూ తెల్లవారు జామున లేచి మంత్రాంగములు మంత్రులతో చర్చించాలి. అప్పుడు ఏకాంతము లభిస్తుంది. మరొక మాట! నీవు ఒక్కడివే ఆలోచించి నిర్ణయం తీసుకోడమూ తప్పు. అలాగని ఎక్కువమందితో ఆలోచించడము కూడా తప్పే. ఎందుకంటే నీ ఆలోచనలు అందరికీ తెలిసే ప్రమాదం ఉంది.
భరతా! నీ పాలన ఎలా ఉంది! జాగరూకతతో ఉంటున్నావా లేక సమయం కాని సమయాలలో నిద్రపోతున్నావా! రాజుకు నిద్ర చేటు తెస్తుంది. సదా జాగరూకుడవై ఉండాలి. నీవు ఎల్లప్పుడూ తెల్లవారు జామున లేచి మంత్రాంగములు మంత్రులతో చర్చించాలి. అప్పుడు ఏకాంతము లభిస్తుంది. మరొక మాట! నీవు ఒక్కడివే ఆలోచించి నిర్ణయం తీసుకోడమూ తప్పు. అలాగని ఎక్కువమందితో ఆలోచించడము కూడా తప్పే. ఎందుకంటే నీ ఆలోచనలు అందరికీ తెలిసే ప్రమాదం ఉంది.
భరతా! ఎల్లప్పుడూ తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేపనులకు ప్రాధాన్యం ఇవ్వాలి. అటువంటి పనులను ఆలస్యం చేయకుండా వెంటనే చేయాలి. కాని ఒక విషయంలో జాగ్రత్త వహించాలి. నీవు ఒక పనినిపూర్తి చేసిన తరువాతనే దానిని బహిరంగ పరచాలి. అంతేగానీ, చేయబోయే పనులను ఎవరికీ తెలియనీయ కూడదు. ఎందుకంటే నీ శత్రువులు, నీవు తలపెట్టిన పనులకు ఆటంకం కలిగించే అవకాశం ఉంది. నీవు, నీ మంత్రులు నీతిమంతులుగా, రహస్యములను బట్టబయలు చేయకున్నా, మీ చుట్ట పక్కల వారు నేర్పుగా మీ రహస్యములను రాబట్ట వచ్చు. అటువంటి వారిని దూరంగా ఉంచుతున్నావు కదా!
భరతా! అవసరమైతే వేయి మంది మూర్ఖులనైనా వదులు కోగాని, ఒక పండితుని మాత్రము నీ దగ్గరకు చేర్చుకో. పండితులు నీకు ఆపదలలో సాయం చేయగలరు. మూర్ఖులు ఎంతమంది ఉన్నా, తిండి చేటు తప్ప ఎలాంటి సాయమూ చెయ్యరు. మూర్ఖులైన మంత్రులు పది మంది కన్నా మేధావి, పరాక్రమంతుడు, నిజాయితీ పరుడు, పండితుడు అయిన ఒక్క మంత్రి చాలు. ఆ రాజు క్షేమంగా ఉండగలడు.
నీ సేవకులను వారి వారికి తగిన స్థానములలో నియమించావు కదా! ఎక్కువ సామర్థ్యం ఉన్నవారిని గొప్ప స్థానములలోనూ, కాస్త మధ్యస్థంగా తెలివితేటలు ఉన్నవారిని, మధ్యమ స్థానములలోనూ, పూర్తిగా తెలివితేటలే లేనివారిని అధమ స్థానములలోనూ నియమించావా!
నీవు ఉద్యోగులను నియమించే ముందు వారిని కఠిన మైన పరీక్షలకు గురిచేసి అందులోనే నెగ్గిన వారినే ఉద్యోగులుగా నియమిస్తున్నావు కదా!
నీదేశములో ప్రజలు శాంతి భద్రతలు లోపించి, భయభ్రాంతులవుతుంటే నీ మంత్రులు చూస్తూ ఊరుకోడం లేదు కదా!
భరతా! నిన్ను నీ మంత్రులు గౌరవిస్తున్నారా లేక నిన్ను ఎదిరించి అవమానించడం లేదు కదా! ఎందుకంటే భరతా! నీ ఆంతరంగికులు, మంత్రులు ఎవరైనా నీకు ఎదురు తిరిగితే అటువంటి వారిని ఉపేక్షించరాదు. అలా ఉపేక్షిస్తే ఆ రాజు ప్రాణాలకే ముప్పు.
భరతా! ఇంక నీసేనాపతులు ఎలా ఉన్నారు. సమర్థుడు, విద్యావంతుడు, పరాక్రమ వంతుడు, నిజాయితీ పరుడు, నీకు విశ్వాసపాత్రుడు అయిన వారిని నీ సేనాపతులుగా నియమించావు కదా! బలవంతులు, యుద్ధములో నేర్పు ప్రదర్శించినవారిని గౌరవిస్తున్నావు కదా! నీ సైనికులకు సకాలంలో, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, జీత భత్యములు అందజేస్తున్నావు కదా! ఎందుకంటే సకాలంలో జీతభత్యములు అందక పోతే సైనికులలో అసంతృప్తి చెలరేగుతుంది. తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంది.
నీ రాజ్యములో ఉండే ప్రజలందరూ నీ పట్ల విధేయులుగా ఉన్నారు కదా. నీకోసం తమ ప్రాణములను సైతం అర్పించుటకు సిద్దంగా ఉన్నారు కదా! నీ దూతలుగా ఎవరిని నియమించుకున్నావు? వారు నీ దేశములో పుట్టిన వారు అయి ఉండాలి. అన్ని విషయములను తెలిసిన సమర్థుడు అయి ఉండాలి. నీవు చెప్పిన విషయములను నేర్పుగా ఉన్నది ఉన్నట్టు ఎదుటివారికి చెప్పే సామర్థ్యం కలిగి ఉండాలి. పైగా అతడు పండితుడు అయి ఉండాలి. ఇటువంటి అర్హతలు కలిగిన పురుషుని నీ దూతగా నియమించు కున్నావు కదా!
నీ స్వదేశములో గానీ, నీ శత్రుదేశములలో గానీ జరిగే విషయములను ఎప్పటి కప్పుడు గూఢచారుల వలన తెలుసుకుంటూ అప్రమత్తంగా ఉంటున్నావు కదా!
భరతా! ఒకసారి నీతో యుద్ధము చేసి ఓడిపోయిన నీ శత్రువు వాడేం చేస్తాడులే అని విడిచిపెట్టకూడదు. వాడి పట్ల జాగరూకతగాఉండాలి. వాడు మరలా తన బలాన్ని పెంచుకొని నిన్ను దొంగదెబ్బ తీయగలడు.
భరతా! కేవలము లౌకిక సుఖములగురించి ఆలోచించే నాస్తికవాదుల పట్ల జాగ్రత్తగా ఉండు. వారిని దగ్గర చేరనీయకు. అలాగే, చాలా మంది అజ్ఞానులు, తాము పండితులమనీ, తమకు అంతా తెలుసు అనీ విర్రవీగుతుంటారు. అలాంటివారి పట్ల జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే ఇలాంటి వారు ధర్మశాస్త్రములను నమ్మరు. అనవసరమైన తర్కములు చేస్తూ, ప్రజలకు ధర్మశాస్త్రముల పట్ల అపనమ్మకము కలిగిస్తుంటారు. వీరి మాటలు నమ్మకు.
భరతా! అతి పురాతనమైనదీ, ఎందరో చక్రవర్తులు పరిపాలించినదీ అయిన అయోధ్యను జాగ్రత్తగా కాపాడుకుంటున్నావు కదా! ఎందుకంటే అయోధ్య పురాతనమైనా అన్నీ సౌకర్యములు కల నగరము. అయోధ్యలో ఉన్న వ్యవసాయభూములకు, నివాస స్థలములకు నిర్దిష్టమైన హద్దులు, వాటిని తెలిపే గుర్తులు కలిగి ఉన్నాయి. అందు వలన న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం లేదు. అయోధ్యలో దేవాలయములు, సత్రములు, చెరువులూ సమృద్ధిగా ఉన్నాయి. అయోధ్యలో ఏటా ఉత్సవములు జరుగుతుంటాయి. ప్రజలందరూ సుఖసంతోషాలతో అలరారుతుంటారు. అయోధ్యలో పంటభూములు సమృద్ధిగా ఉన్నాయి. పశుసంపద అపారంగా ఉంది. ఖనిజ సంపదకు ఆలవాలమైన గనులు అనేకం ఉన్నాయి. హింస అనే పదానికి అయోధ్యలో తావు లేదు. అయోధ్యలో పాపాత్ములు లేరు. అయోధ్య కోట సురక్షితమైనది. అటువంటి అయోధ్యను నీవు చక్కగా రక్షిస్తున్నావు కదా!
నీ రాజ్యములో వర్తక వాణిజ్యములు ఎలాంటి ఆటంకములు లేకుండా సాగుతున్నాయి కదా! వర్తకులు నీకు అనుకూలంగా ఉన్నారు కదా! నీ రాజ్యములో గోరక్షణ సాగుతున్నదికదా! నీ పాలనలో ప్రజలు సురక్షితంగా ఉన్నారు కదా! ఎందుకంటే ప్రజారక్షణ రాజు బాధ్యత.
నీ అంతఃపుర స్త్రీలకు నీ రహస్యములను వెల్లడి చేయకుండా, వారిని సరససంభాషణలతో సంతోషపెడుతున్నావు కదా! కాని వారి మాటలకు మోసపోయి తప్పుదారి తొక్కవద్దు. నీవు గజసంపదను చక్కగా పోషిస్తున్నావు కదా! గజ సంపదను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ఉండు. రాజ్య రక్షణకు గజసంపద చాలా కీలకము.
భరతా! నీవు ప్రతిరోజూ నీ ప్రజలను కలుసుకుంటూ వారి కష్టసుఖములు తెలుసుకుంటున్నావు కదా!
భరతా! నీ దగ్గర పని చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించి వారు నిన్ను చూడగానే భయపడేట్టు చేయవద్దు. అలాగని వారికి అధిక చనువు ఇవ్వవద్దు. మధ్యేమార్గంగా వారితో మెలుగుతూ ఉండు. నీ రాజ్యములో ధనము, ధాన్యము, నీరు, నిలవలు సమృద్ధిగా ఉన్నాయికదా. నీకు చాలినంత సైన్యము, యంత్రసామగ్రి సమకూర్చు కున్నావు కదా!
భరతా! నీ ఆర్ధిక పరిస్థితి ఎలా ఉంది. నీ ఆదాయము ఎక్కువ, వ్యయము తక్కువగా ఉందికదా!
భరతా! ప్రజాధనము అపాత్రుల చేతులలోనికి వెళ్లడం లేదు కదా! నీవు నీ ధనమును దేవ కార్యములకు, పితృకార్యములకు, అతిధి సత్కారములకు, బ్రాహ్మణులకు, సైనికులకు, మిత్రవర్గములకు వ్యయం చేస్తున్నావు కదా!
భరతా! ఇంక న్యాయ విషయాలకు వస్తాను. నిరపరాధుల మీద నేరం మోపితే, వారిని విచారించకుండా, వారికి తన వాదన వినిపించడానికి అవకాశం ఇవ్వకుండా, దురాశతో అతనికి మరణదండన విధించడం లేదు కదా!
భరతా! ఎవరైనా దొంగతనముచేస్తూ ఉంటే ప్రత్యక్షంగా చూచి పట్టుకొంటే, అతడు దొంగతనం చేస్తున్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబితే, అటువంటి దొంగలను నీ అధికారులు ధనలోభము చేత
విడిచిపెట్టడం లేదు కదా! న్యాయ నిర్ణయము చేసేటప్పుడు నీ న్యాయాధికారులు వీడు ధనికుడు, వీడు పేదవాడు అనే బేధబుద్ధి లేకుండా నిష్పక్షపాతంగా న్యాయ నిర్ణయం చేస్తున్నారు కదా!
విడిచిపెట్టడం లేదు కదా! న్యాయ నిర్ణయము చేసేటప్పుడు నీ న్యాయాధికారులు వీడు ధనికుడు, వీడు పేదవాడు అనే బేధబుద్ధి లేకుండా నిష్పక్షపాతంగా న్యాయ నిర్ణయం చేస్తున్నారు కదా!
భరతా! ఒక విషయం గుర్తుపెట్టుకో. ఏ రాజైనా తన ఇష్టం వచ్చినట్టు శాసనములను చేసి, అమాయకులను కష్టముల పాలు చేస్తాడో, అయాయకుల మీద అక్రమంగా నేరములు మోపి శిక్షిస్తాడో, ఆ రాజు ఎక్కువ కాలము రాజుగా ఉండలేడు. అతని రాజ్యంలో ప్రజలు కార్చిన కన్నీళ్లే ఆ రాజును శిక్షిస్తాయి. సర్వనాశనం చేస్తాయి.
ఓ భరతా! నీ రాజ్యములో శిశువులను, వృద్ధులను, పండితులను ఆదరిస్తున్నావు కదా!
ఓ భరతా! నీవు ధన సంపాదనకోసం ధర్మాన్ని విడిచిపెట్టడం, సుఖములు మరిగి భోగలాలసుడవై ధర్మమును విడిచి, ధనమును దుర్వినియోగం చెయ్యడం లాంటివి చేయడం లేదుకదా! నీవు ధర్మపరంగా ధనసంపాదన చేస్తూ, ధర్మమార్గంలో సంపాదించిన ధనమునకు తగ్గ కోరికలతో తృప్తిపడుతూ, రాజ్యము చేస్తున్నావుకదా!
ఓభరతా! నీవు ఎల్లప్పుడూ నీ రాజ్యములో ఉన్న ప్రజల క్షేమము కోరుతున్నావు కదా!
ఓ భరతా! రాజు చెయ్యకూడనివి, ఆచరించరానివి చెబుతాను విను. రాజు నాస్తికుడు కారాదు. అసత్యము పలుకరాదు. రాజుకు కోపము పనికిరాదు. రాజుకు నిర్లక్ష్యం పనికిరాదు. రాజు
విషయములను గురించి దీర్ఘంగా ఆలోచిస్తూ సాగదీయడం, నాన్చడం పనికిరాదు. జ్ఞానులను నిర్లక్ష్యం చేయకూడదు. రాజులకు సోమరి తనం పనికిరాదు. ఇంద్రియ సుఖములకు లోనుకాకూడదు. సమిష్టిగా నిర్ణయాలు తీసుకోవాలే గానీ, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకూడదు. తీసుకొన్ననిర్ణయాలను అమలు చేయకుండా ఉండకూడదు. రాజు తన ఆలోచనలను రహస్యంగా ఉంచాలి. బహిర్గతం చేయకూడదు. ప్రజాక్షేమం పాటించాలి. ప్రజావ్యతిరేక పనులు
విషయములను గురించి దీర్ఘంగా ఆలోచిస్తూ సాగదీయడం, నాన్చడం పనికిరాదు. జ్ఞానులను నిర్లక్ష్యం చేయకూడదు. రాజులకు సోమరి తనం పనికిరాదు. ఇంద్రియ సుఖములకు లోనుకాకూడదు. సమిష్టిగా నిర్ణయాలు తీసుకోవాలే గానీ, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకూడదు. తీసుకొన్ననిర్ణయాలను అమలు చేయకుండా ఉండకూడదు. రాజు తన ఆలోచనలను రహస్యంగా ఉంచాలి. బహిర్గతం చేయకూడదు. ప్రజాక్షేమం పాటించాలి. ప్రజావ్యతిరేక పనులు
చేయకూడదు. శత్రువులను నేర్పుగా ఎదుర్కోవాలి కానీ, మూర్ఖంగా ఒక్కుమ్మడిగా ఎదుర్కోకూడదు. రాజైన వాడు పైచెప్పిన వాటిని విడిచిపెట్టాలి.
భరతా! మరలా చెప్పుచున్నాను. ఎప్పుడూ నీ సొంత నిర్ణయాలు తీసుకోకు. మంత్రులతో కూలంకళంగా చర్చించి సమిష్టి నిర్ణయాలు తీసుకో. మంత్రులతో నీ చర్చలను చాలా రహస్యంగాఉంచు. నీవు ప్రతిరోజూ నీ భార్యతో కలిసి వేదాధ్యయనము చెయ్యి. అది మంచి ఫలితాలనిస్తుంది.నీ బుద్ధిని ఎల్లప్పుడూ ధర్మము నందే ఉంచు. ధర్మము వలననే అర్థ,కామములను పొందు. మన తండ్రిగారు, మన తాత ముత్తాతలు ఈ మార్గమునే అనుసరించారు. నీవుకూడా అదే ధర్మమార్గము అనుసరించి రాజ్యపాలన చెయ్యి.
మరొక మాట. నీవు భుజించునపుడు నీ మిత్రులతో సహాభుజించు. ఒంటరిగా భుజించవద్దు. పైచెప్పిన ప్రకారము రాజ్యపాలన చేసిన రాజు మరణానంతరము నరకమునకుకాకుండా స్వర్గమునకు వెళతాడు. "అని రాముడు భరతునికి రాజనీతి ఉపదేశించాడు.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నూరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment