శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - పదిహేడవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 17)

శ్రీమద్రామాయణము

అయోధ్యా కాండము

పదిహేడవ సర్గ

రాముడు అయోధ్యా పురవీధుల గుండా వెళుతున్నాడు. శోభాయమానంగా అలంకరించిన అయోధ్యానగరాన్ని తనివిదీరా చూస్తున్నాడు. రాజమార్గములో అటు ఇటా నిలబడ్డ పౌరులు రాముని దీవిస్తున్నారు.

“ఓ రామా! నీవు అయోధ్యానగరమునకు పట్టాభిషిక్తుడవై నీ తాత ముత్తాతలు అనుసరించిన ధర్మమార్గమును అనుసరించి ప్రజలను పాలింపుము. నీ పాలనలో ప్రజలు నీ తండ్రిపాలనలో కన్నా ఎక్కువగా సుఖిస్తారు.” అని మనసారా దీవిస్తున్నారు.

ఇంకొంతమంది. “ఆహా! పట్టాభిషేకము చేసుకోబోతున్న రాముని చూస్తుంటేనే కడుపు నిండిపోయింది. ఇంక మనకు అన్నపానీయాలు అక్కరలేదు.” అని అనుకొంటున్నారు.

ఇంకొంత మంది రాముడు వెళ్లినంత సేపూ అలాగే చూస్తున్నారు. ఈ రోజు రాముని చూడని జన్మ కూడా ఒక జన్మేనా అని అనుకొంటున్నారు.

ఆ ప్రకారంగా రాముడు అయోధ్యాపురవీధుల గుండా వెళుతున్నాడు. తుదకు దశరథమహారాజు మందిరము చేరుకున్నాడు.

రాముడు మహారాజు మందిరము బయట రథము దిగి నడుచుకుంటూ అంత:పురములోనికి వెళ్లాడు. రామునితో వచ్చిన వాళ్లందరూ రాజ మందిరము బయటనే నిలబడ్డారు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము పదిహేడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)