శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - పదునాలుగవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 14)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
పదునాలుగవ సర్గ
కైక మరలా తన ధోరణిలో దశరథునితో ఇలా అంది."ఓ దశరథమహారాజా! నీవు నీ ప్రాణాపాయ దశలో నాకు ఇస్తాను అన్న వరాలు రెండింటి ఈనాడు నేను కోరాను. ఆ మాత్రానికే ఇలా నేల మీదపడి దొర్లి దొర్లి ఏడవవలెనా! ఇది ఒక మహారాజుకు మర్యాదగా ఉంటుందా! ఆడిన మాట తప్పకపోవడం, ఎల్లప్పుడూ సత్యమునే మాట్లాడటం ఏనాటినుంచో ఉన్న ధర్మము. నేను అదే చెబుతున్నాను. తమరిని సత్యము ధర్మమును పాటించమంటున్నాను. ఆడినమాట తప్పవద్దు అని అంటున్నాను. ఇదేనా నేను చేసిన తప్పు. మీపూర్వులైన శిబిచక్రవర్తి, అలర్కుడు అనుసరించిన మార్గమునే మీరూ అనుసరించి కీర్తి ప్రతిష్టలు పొందమంటున్నాను. అదేనా నేను చేసిన పాపం.
"సత్యము పరబ్రహ్మస్వరూపము. ధర్మమునకు సత్యమే మూలము" అని మీకు నేను చెప్పదగిన దానిని కాదు. తాము సర్వజ్ఞులు. తమరికి అన్నీ తెలుసు. ఆ సత్యనిష్టను, ధర్మనిరతిని నేను పాటించమంటున్నాను. అన్న మాటను నిటబెట్టుకోమంటున్నాను. ధర్మము పాటించమంటున్నాను. నాకు ఇస్తానన్న వరాలు ప్రసాదించండి. అదే నేను కోరేది. నేనేమీ కొత్తగా కోరడం లేదు. నీవు ఆనాడు ఇస్తాను అన్న వరాలే ఈ నాడు అడుగుతున్నాను. అదే ధర్మము. ఆ ధర్మాన్ని నిలపడం కోసం రాముని అడవులకు పంపండి. మరొక మాట వద్దు.
“రాముని అడవులకు పంపాలి”, “రాముని అడవులకు పంపాలి" “రాముని అడవులకు పంపాలి" అని మూడు మార్లు నొక్కి చెబుతున్నాను.
ఓ దశరథమహారాజా! మీరు నాకు ఇచ్చిన వరములను తీర్చకపోయినట్టయితే మీరు నన్ను వదిలివేసినట్టే భావిస్తాను. భర్త వదలిన భార్యకు మరణమే శరణ్యము అందుకని నేను మీ ఎదురుగుండా ప్రాణత్యాగము చేసుకుంటాను. ఇది తథ్యము." అని నిక్కచ్చిగా చెప్పింది కైక.
దశరథునికి ఆఖరు ఆశ కూడా అడుగంటి పోయింది. రామునికి వనవాసము తథ్యము అనుకున్నాడు. కుప్పకూలిపోయాడు. అతని హృదయము బరువెక్కింది. ముఖము వివర్ణమయింది. కళ్లు కనిపించడం లేదు. మరలా ధైర్యము కూడగట్టుకున్నాడు. కైకతో తన నిర్ణయాన్ని ఇలా ప్రకటించాడు.
" ఓసీ పాపీ! కైకా! అగ్నిసాక్షిగా నేను నీ పాణిగ్రహణము చేసాను. నీ పాణిగ్రహణము రోజు నేను ఏ చేతిని పట్టుకున్నానో ఆ చేతిని వదిలివేస్తున్నాను. దానితో పాటు నీ వలన నాకు పుట్టిన కుమారుని కూడా వదిలివేస్తున్నాను. ఇంక నీకూ నాకూ సంబంధం లేదు. నీవు నా భార్యవు కావు. భరతుడు నా కుమారుడూ కాడు. నీవు నా కుమారుడు రాముని పట్టాభిషేకము చెడగొట్టావు. నేను మరణించిన తరువాత నీ కుమారుడు నాకు తిలోదకములు వదలనవసరము లేదు. రాముడే నాకు ఉత్తరక్రియలు నిర్వర్తిస్తాడు. రాముని పట్టాభిషేకము అని నేను ప్రకటించగానే జనము హర్షధ్వానాలు చేసారు. ఇప్పుడు నేను రాముని అడవులకు పంపుతున్నాను అని తెలిసి అయోధ్యలో ఉన్న జనము దుఃఖములో మునిగిపోతారు. వారి దుఃఖము నేను చూడలేను. అందుకే రాముడు అరణ్యములకు పోకముందే నేను ప్రాణములు విడుస్తాను.” అని అన్నాడు దశరథుడు.

ఇంతలో తెల తెల వారుతూ ఉంది.పక్షులు కిల కిలారావాలు చేస్తున్నాయి. కాని కైకకు ఇవేమీ పట్టలేదు. తనపట్టు నెగ్గించు కోవాలనేకోరిక తప్ప. అందుకే దీనంగా నేలమీద పడి ఉన్న దశరథుని చూచి ఇలాఅంది.
'ఓ దశరథమహారాజజా! ఎందుకు చెప్పిన మాటలే చెప్పి నీవు బాధపడి అందరినీ బాధపెడతావు. జరగాల్సిన కార్యక్రమం చూడు. రాముని పిలిపించు. అతనికి నీ నిర్ణయాన్ని వినిపించు. రాముని వనవాసమునకు పంపించు. భరతునికి పట్టాభిషేకము ప్రకటించు. తూర్పు తెల్లవారుతోంది. త్వరగా కానివ్వండి." అని తొందరపెట్టింది.
ఆ మాటలకు దశరథుడు చెళ్లున కొరడాతో కొట్టిన గుర్రము మాదిరి పైకి లేచాడు. నిర్వేదంగా ఉన్నాడు. ఆయన బుద్ధిపనిచేయడం మాని వేసింది.
“నేను ధర్మానికి కట్టుబడ్డాను. ధర్మబద్ధుడను. నేను రాముని చూడాలని అనుకుంటున్నాను. రాముని పిలిపించండి." అని అన్నాడు.
అప్పటికే తెల్లవారింది. శుభముహూర్తము సమీపిస్తూ ఉంది. వసిష్ఠుడు పట్టాభిషేకమునకు కావలసిన సంభారములు తన శిష్యులు తీసుకొని వస్తుంటే అయోధ్యలో ప్రవేశించాడు.
అప్పటికే రాజవీధులన్నీ పన్నీటితో తడిపారు. పతాకాలు కట్టారు. తోరణాలు కట్టారు. రాజవీధులన్నీ రకరకాల పూలతో అలంకరించారు. చుట్టు పక్కల గ్రామాలనుండి వచ్చిన ప్రజలతో, అయోధ్య ప్రజలతో వీధులు క్రిక్కిరిసిపోయాయి. ప్రజలందరూ రామ పట్టాభిషేకము చూడ్డానికి ఉవ్విళ్లూరుతున్నారు.

వసిష్ఠుడు రాజమందిరము దగ్గరకు వచ్చాడు. అప్పటికే బ్రాహ్మణులు అసంఖ్యాకంగా అక్కడికి చేరుకున్నారు. వారిని చూచి వసిష్ఠుడు ఎంతో సంతోషించాడు. వారి మధ్యనుండి దారి చేసుకుంటూ రాజభవనము లోకి ప్రవేశించాడు.
సుమంత్రుడు వసిష్ఠునికి ఎదురుగా వచ్చాడు. సుమంతుడు వసిష్ఠునికి నమస్కరించాడు. “సుమంత్రా! నీవు వెంటనే దశరథ మహారాజు వద్దకు పోయి నేను వచ్చినట్టు వారికి మనవి చెయ్యి. రామ పట్టాభిషేకమునకు కావాల్సిన సంభారములు అన్ని సిద్ధంగా ఉన్నాయి. అభిషేకమునకు గంగాజలమూ, పుణ్య నదీజలములు, సముద్రజలము సిద్ధంగా ఉన్నాయి. నవధాన్యాలు, తేనె, పెరుగు, నెయ్యి, పేలాలు, దర్భలూ, పూలు, పాలు, కన్యముత్తయిదువలు, ఏనుగులు, రథములు,
ఖడ్గములు, ధనుర్బాణములు, పల్లకీలు, ఛత్రచామరములు, వింజామరములు, బంగారు కలశములు, తెల్లని ఎద్దు, తెల్లని గుర్రములు, పులి చర్మమూ, అగ్నిహోత్రము, రకరకాల వాద్య విశేషములు, చక్కగా అలంకరించుకున్న స్త్రీలు, గురువులు, విప్రులు, గోవులు, అయోధ్యాప్రజలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరూ రామ పట్టాభిషేకమునకు సిద్ధంగా ఉన్నారు. సూర్యోదయము అయింది. శుభముహూర్తము సమీపిస్తూ ఉంది. కాబట్టి సుమంత్రా! నీవు రాజు గారి వద్దకు పోయి మేము వచ్చామని చెప్పి, తొందరగా సిద్ధంకమ్మను.” అని అన్నాడు వసిష్ఠుడు.

ఆ మాటలు విన్న సుమంత్రుడు వసిష్ఠునికి నమస్కరించి దశరధుని వద్దకు వెళ్లాడు. అప్పటిదాకా జరిగిన విషయములు ఏవీ తెలియవు సుమంత్రునకు. అందుకని దశరథుని స్తుతించడం మొదలెట్టాడు.
“మహారాజు దశరథులవారికి జయీభవ. విజయీభవ. ఈ పట్టాభిషేక మహోత్సవము తమరికి అపరిమితమైన సంతోషించు గాక! దేవేంద్రుని సారధి మాతలి ఇంద్రుని స్తుతించి నట్టు నేను దేవేంద్ర సమానుడైన తమరిని స్తుతిస్తున్నాను. స్వయంభువు, వేదవేదాంగ ములను సృష్టించిన వాడూ అయిన బ్రహ్మను స్తుతించినట్టు నేను తమరిని స్తుతిస్తున్నారు. ఉదయమే సూర్యుడు, రాత్రి చంద్రుడూ వచ్చి భూదేవిని మేల్కొలిపి నట్టు నేను తమరిని మేల్కొలుపుతున్నాను.
ఓ మహారాజా! సూర్యోదయము అయింది. రామ పట్టాభి షేకమునకు కావాల్సిన సంభారములు అన్ని సిద్ధంచేయబడ్డాయి.
ఓ దశరథమహారాజా! తమరు వెంటనే మేల్కొని మంగళ స్నానం చేసి, రామ పట్టాభిషేకమునకు సిద్ధం కావాలని వసిష్ఠులవారి ఆదేశము. ఓ మహారాజా! తమరికి సూర్య చంద్రులు, శివకేశవులు, అగ్ని వరుణుడు, ఇంద్రుడు తమరికి సకలైశ్వర్యములు కలిగించుగాక!
ఓ దశరథమహారాజా! వసిష్ఠులవారు బ్రాహ్మణసమూహము లతో రాజద్వారము వద్ద తమరి రాక కోసం వేచిఉన్నారు. తమరు తొందరగా వచ్చి రామ పట్టాభిషేకమునకు అనుజ్ఞ ఇవ్వవలసినదిగా వేడుకొనుచున్నాను." అనిపలుకుతున్న సుమంత్రుని పలుకులు విన్న దశరథునికి దు:ఖము ఇంకా ఎక్కువ అయింది. అమంగళము జరగబోతూ ఉంటే సుమంత్రుని మంగళవాచకములు దశరథునికి కర్ణకఠోరంగా వినిపించాయి.
“ఆపు. ఇంక చాలు" అని గట్టిగా అరిచాడు. ఆ అరుపుకు సుమంత్రుడు భయపడిపోయాడు. ఒక పక్కకు ఒదికి నిలబడ్డాడు.
ఇదంతా చూస్తూ ఉన్న కైక అక్కడకు వచ్చింది. “సుమంత్రా! రాత్రి అంతా మహారాజుగారు పట్టాభిషేక సన్నాహముల గురించి చర్చించి చర్చించి రాత్రి అంతా నిద్రలేకుండా గడిపారు. అందువలన కొంచెం చిరాకుగా ఉన్నారు. నీవు పోయి మహారాజు గారు రమ్మన్నారని చెప్పి శీఘ్రముగా రాముని ఇక్కడకు తీసుకొని రా.” అని ఆజ్ఞాపించింది కైక.
"అలాగే మహారాణీ! తమ ఆజ్ఞ నెరవేరుస్తాను. రాముని ఇక్కడకు వెంటనేరమ్మని మనవిచేస్తాను." అని పలికి సుమంత్రుడు అక్కడినుండి వెళ్లిపోయాడు. అప్పటికే రాజద్వారము వద్ద నిలబడి ఉ న్న సామంతరాజులను, అయోధ్యలోని ధనవంతులను, పౌరులను చూచాడు సుమంత్రుడు.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము పదునాల్గవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment