శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఎనిమిదవ సర్గ (Ramayanam - Balakanda - Part 38)
శ్రీమద్రామాయణము
బాలకాండ
ముప్పది ఎనిమిదవ సర్గ
ఓ రామా! ఇప్పుడు నీకు సగరుడి కధ చెబుతాను విను. పూర్వము అయోధ్యా నగరమును సగరుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు.ఆయనకు పుత్ర సంతానము లేదు. విదర్భ రాజ కుమారి కేశిని అతని మొదటి భార్య.. సుమతి ఆయన రెండవ భార్య..పుత్ర సంతానము కొరకు సగరుడు ఇద్దరు భార్యలతో సహా హిమవత్పర్వతమునకు పోయి అక్కడ భృగుప్రస్రవణము అనే పర్వతము మీద నూరు సంవత్సరముల పాటు తపస్సు చేసారు. వారి తపస్సునకు మెచ్చిన భృగు మహర్షి వారికి పుత్ర సంతానము ప్రసాదించాడు.
“ఓ సగర చక్రవర్తీ! నీకు ఒక భార్య యందు ఒక కుమారుడు, మరొక భార్య యందు అరవైవేల మంది కుమారులు జన్మిస్తారు." అని వరము ఇచ్చాడు. వారు ఎంతో సంతోషించారు. కాని వారికి ఒక సందేహము కలిగింది. " ఓ మహర్షీ! మాలో ఎవరికి ఒక పుత్రుడు కలుగుతాడు." అని అడిగారు.
“ఆ విషయం మీలో మీరే తేల్చుకోండి." అని అన్నాడు. భృగుమహర్షి.
అప్పుడు కేశిని " ఓ మహర్షి! నాకు వంశము నిలిపే ఒక కుమారుని ప్రసాదించండి." అని కోరుకుంది. రెండవ భార్య సుమతి “నాకు 60,000 వేల మంది కుమారులను ప్రసాదించండి." అని కోరుకుంది.
భృగుమహర్షి వారిని ఆ ప్రకారము అనుగ్రహించాడు. భృగుమహర్షికి నమస్కరించి అయోధ్యకు తిరిగి వచ్చారు. కాలక్రమేణా ఇరువురు గర్భములు ధరించారు. పెద్ద భార్య కేశిని అసమంజుడు అనే కుమారుని ప్రసవించింది. రెండవ భార్య ఒక పెద్ద పిండమును ప్రసవించింది. అది పగిలి అందులో నుండి 60,000 మంది పుత్రులు జన్మించారు. వారందరూ పెరిగి పెద్ద వారు అయ్యారు.
వారందరూ ఆటలు ఆడుతు ఉండగా పెద్దవాడు మిగిలిన వారిని నీటిలో ముంచి, వారు అరిచి కేకలు పెడుతుంటే, ఆనందించేవాడు. అనేక రకములైన పాప కార్యములను చేయుతూ జనులను బాధ పెడుతూ ఉండేవాడు. వాడి బాధ పడలేక సగరుడు అసమంజుని రాజ్యమునుండి వెళ్లగొట్టాడు. ఆ అసమంజుని పుత్రుడు అంశు మంతుడు. అతడు తండ్రి మాదిరి కాకుండా ఎంతో ధార్మికుడు. సజ్జనుడు. అందరూ అతను అంటే ఇష్టపడేవారు.
వారందరూ ఆటలు ఆడుతు ఉండగా పెద్దవాడు మిగిలిన వారిని నీటిలో ముంచి, వారు అరిచి కేకలు పెడుతుంటే, ఆనందించేవాడు. అనేక రకములైన పాప కార్యములను చేయుతూ జనులను బాధ పెడుతూ ఉండేవాడు. వాడి బాధ పడలేక సగరుడు అసమంజుని రాజ్యమునుండి వెళ్లగొట్టాడు. ఆ అసమంజుని పుత్రుడు అంశు మంతుడు. అతడు తండ్రి మాదిరి కాకుండా ఎంతో ధార్మికుడు. సజ్జనుడు. అందరూ అతను అంటే ఇష్టపడేవారు.
కొంత కాలము తరువాత సగరుడు ఒక యజ్ఞమే చేయ సంకల్పించాడు. పురోహితులను, ఋత్తిక్కులను సంప్రదించాడు. యజ్ఞమునకు కావలసిన సంభారములు సమకూర్చుకున్నాడు. యజ్ఞము చేయ పూనుకున్నాడు.
ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో ముప్పది ఎనిమిదవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ంతత్సత్ ఓంతత్సత్.
Comments
Post a Comment