శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 27)
శ్రీమద్రామాయణము
బాలకాండ
ఇరవై ఏడవ సర్గ
మరునాడు అందరూ నిద్ర లేచారు. ప్రాతఃకాలము లో ఆచ రించ వలసిన సంధ్యావందనము మొదలగు కార్యక్రమములు నిర్వర్తించారు.విశ్వామిత్రుడు రామునితో “రామా! నీకు దివ్యాస్త్రములు అన్ని ఇస్తాను. వాటితో నీవు దేవతలను, అసురులను, గంధర్వులను యుద్ధములో జయింపగలవు.
రామా! నీకు దివ్యమైన దండ చక్రమును, ధర్మ చక్రమును, కాల చక్రమును, విష్ణు చక్రమును, అతి ఉగ్రమైన ఇంద్రాస్త్రమును, వజ్రాస్త్రమును, శివుని శూలముతో సమానమైన శూలాస్త్రమును, బ్రహ్మశిరోనామకాస్త్రమును, అన్నిటి కంటే ఉత్తమము, శ్రేష్ఠము అయిన బ్రహ్మాస్త్రమును నీకు ప్రసాదించెదను. ఇవి కాకుండా నీకు మోదకి, శిఖరి అనే రెండు గదాయుధములను కూడా ఇస్తాను.
రామా! నీకు ధర్మపాశము, కాలపాశము, వారుణాస్త్రము ఇస్తాను. ఇవే కాకుండా నీకు రెండు పిడుపాటులను అనగా తడిగా ఉన్న పిడుగు, పొడిగాఉన్న పిడుగు ఇచ్చెదను. నీకు పినాక అస్త్రమును, నారాయణాస్త్రమును ఇచ్చెదను.
రామా! నీకు ఆగ్నేయాస్త్రమును, వాయవ్యాస్త్రమును ఇచ్చెదను.
ఓ రామా! నీకు హయశిరము, క్రౌంచ అస్త్రము అనే రెండు శక్తులను ప్రసాదిస్తున్నాను. రాక్షసులు వాడేటటు వంటి అస్త్రములు, అనగా కంకాళము, ముసలము, కపాలము, కంకణము నీకు ఇస్తున్నాను.
ఓ రామా! నీకు విద్యాధరముఅనే మహాస్త్రమును, నందనము అనే ఖడ్గమును ఇస్తున్నాను. నీకు గాంధర్వ అస్త్రమును, సౌర అస్త్రమును ఇస్తున్నాను. ఇవి నిద్రావస్థను కలుగ చేస్తాయి. నిద్రావస్థనుండి విముక్తులను చేస్తాయి. వీటికి ఆ ప్రభావము ఉంది.
ఓ రామా! నీకు దర్పణ, శోషణ, సంతాపన, విలాపన, మొదలగు అస్త్రములు, మన్మధుడు ఉపయోగించే మదనాస్త్రమును, పిశాచములు వాడే మోహనాస్త్రమును ప్రసాదిస్తున్నాను.
ఓ రామా! ఇంకా నీకు తామసాస్త్రము, సౌమనాస్త్రము, సంవర్గాస్త్రము, ముసలము, సత్యము అనే అస్త్రము, పరమ శ్రేష్టమైన మాయాధరాస్త్రము, అత్యంత శక్తి వంతము, భయంకరము అయిన త్వష్టురాస్త్రము, మొదలగు అస్త్రములను నీకు ఇస్తున్నాను.
ఓ రామా! ఈ అస్త్రములు అన్నీ కామ రూపులు. తమకు ఇష్టం వచ్చిన రూపములు ధరింపగలవు. అత్యంత బలము కలవి. వీటిని నానుండి వెంటనే గ్రహించు." అని అన్నాడు విశ్వామిత్రుడు.
రాముడు వాటిని భక్తి శ్రద్ధలతో గ్రహించాడు. ఆ అస్త్రములు అన్నీ దేవతలకు కూడా ప్రయోగ ఉపసంహారములతో గ్రహించడం దుర్లభము. అటువంటిది రాముడు ఆ అస్త్రసముదాయమును అవలీలగా అధ్యయనం చేసాడు.
రాముడు వాటిని భక్తి శ్రద్ధలతో గ్రహించాడు. ఆ అస్త్రములు అన్నీ దేవతలకు కూడా ప్రయోగ ఉపసంహారములతో గ్రహించడం దుర్లభము. అటువంటిది రాముడు ఆ అస్త్రసముదాయమును అవలీలగా అధ్యయనం చేసాడు.
విశ్వామిత్రుడు మంత్రములను ఉచ్ఛరిస్తూ ఒకటి వెంట ఒక అస్త్రమును రామునికి ఇస్తూ ఉంటే, ఆ అస్త్రమునకు అధి దేవతలు వచ్చిరాముని ముందు నిలబడి “రామా! ఇకనుండి మేమందరమూ నీకు దాసులము" అని పలికారు.
విశ్వామిత్రుడు ఉపదేశించిన అస్త్రములు అన్నింటినీ రాముడు భక్తితో స్వీకరించాడు. ఆ అస్త్రములకు అధిదేవతలను చూచి “మీరంతా నా మనసులో ఉంటూ నేను మిమ్ములను స్మరించి నపుడు నా వద్దకు రండి" అనిపలికాడు. తరువాత రామ లక్ష్మణులు విశ్వామిత్రుని వెంట ప్రయాణమ
ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో ఇరవై ఏడవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ తత్సత్ ఓంతత్సత్.
Comments
Post a Comment