శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది రెండవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 52)

శ్రీమద్రామాయణము

అరణ్యకాండము

ఏబది రెండవ సర్గ

“అయ్యో! నన్ను కాపాడటానికి వచ్చిన జటాయువు కూడా ఈ దుర్మార్గుడి దౌష్ట్యానికి బలి అయ్యాడే. ఈ పాపాత్ముడు ఈ జటాయువును పక్షి అని కూడా చూడకుండా చంపాడు. 

“ఓ రామా! ఓ లక్ష్మణా! ఎక్కడున్నారు. రండి. నన్ను రక్షించండి" అని ఎలుగెత్తి అరిచింది.

అది చూచిన రావణుడు సీత దగ్గరగా వెళ్లాడు. వికటాట్టహాసం చేసాడు. సీత జుట్టు పట్టుకున్నాడు. అది చూచి ప్రకృతి రోదించింది. వృక్షములు తలలు వంచాయి. గాలి వీచడం మానింది. సీత రామా రామా అంటూ అరుస్తూనే ఉంది. రావణుడు సీతను జుట్టుపట్టుకొని లేవదీసి,తన సందిట ఇరికించుకొని ఆకాశంలో కి ఎగిరాడు. సీతను తీసుకొని ఆకాశమార్గంలో పోతున్నాడు.

ఆ సమయంలో తనను ఎవరన్నా రక్షిస్తారా అని సీత కిందకు చూస్తూ ఉంది. సీత కట్టుకున్న వస్త్రములు గాలికి ఎగురుతూ ఉన్యాయి. సీత పెట్టుకున్న ఆభరణములు చెల్లాచెదురుగా నేల మీద రాలి పడుతున్నాయి. సీత కళ్ల నుండి కన్నీరు ధారాపాతంగా కారుతూ ఉంది. ఆమె జుట్టు ముడి వీడిపోయింది. సీత నోటి నుండి రామా రామా అనే మాట తప్ప మరోమాట రావడం లేదు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఏబదిరెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నాలుగవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 4)